ఇజ్రాయెల్‌లో ‘నిర్భయ’ ఘటన

0
231

మద్యం మత్తులో ఉన్న బాలికపై 30 మంది గ్యాంగ్‌రేప్‌

వాషింగ్టన్‌  : ఇజ్రాయెల్‌లో అమానుషం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న పదహారేళ్ల బాలికపై 30 మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఐలట్‌ పట్టణంలోని రెడ్‌ సీ హోటల్‌లో బాలిక మద్యం మత్తులో ఉండగా వారు ఈ దారుణానికి తెగబడ్డారు.

వాస్తవానికి ఈ ఘటన వారం క్రితం చోటుచేసుకుంది. అయితే దీన్ని ఖండిస్తూ ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, అధ్యక్షుడు ర్యూవెన్‌ రివ్లిన్‌లు తాజాగా ప్రకటనలు విడుదలచేయడంతో.. ఈ అమానుషం ప్రపంచం దృష్టికి వచ్చింది. ఇక ఇంతటి దారుణానికి తెగబడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి.

కాగా, సదరు మైనర్‌పై అత్యాచారం జరిపిన నిందితులంతా 30 ఏళ్లలోపు వారేనని గుర్తించారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్న పోలీసులు ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టుచేశారు. త్వరలోనే మిగతా వారందరినీ అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు నిలబెడతామని పోలీసులు ప్రకటించారు.

Courtesy Andhrajyothi

Leave a Reply