కాబ్, ఎన్నార్సీ వ్యతిరేక పోరాటానికి 100 మంది తెలుగు కవులు, రచయితల మద్దతు

0
256

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(కాబ్), జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ) భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమైనది. ఆధునిక సమాజ నియమాలకు, సహజ న్యాయ సూత్రాలకు విఘాతమైన ఈ చట్టాలను నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రాలు, మైనారిటీ ప్రజలు వినిపిస్తున్న నిరసన స్వరాన్ని తెలుగు రచయితలుగా, కవులుగా, ఆలోచనాపరులుగా బలపరుస్తున్నాం. భారత రాజ్యాంగ పరిరక్షణకై, శాంతియుత సామరస్యానికి పాటుపాడుతున్న ఉద్యమాలకు పూర్తి మద్దతు పలుకుతున్నాం.

మతాలకతీతంగా జీవనవిధానాన్ని సాగిస్తున్న దేశంలో మతాలుగా పౌరసత్వ నిర్ధారణ చేసుకునే విషాద స్థితి కల్పించాలనుకోవడం అప్రజాస్వామికమైనది. శరణార్ధులై, పీడనకు గురై నిలువనీడ కోసం వస్తున్న ప్రజలను మతాలవారీగా కొందరిని ఆహ్వానించడం, మరికొందరిని అడ్డుకోవడం హేయమైంది. కాబ్, ఎన్ఆర్సీలతో ప్రపంచం ముందు భారత సమాజం తలవంచుకునేలా కేంద్ర ప్రభుత్వం చేస్తుండటాన్ని క్షమించలేని చర్యగా అభిప్రాయపడుతున్నాం. వీటిని వ్యతిరేకిస్తున్న ఈశాన్య ప్రజలపై, జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై జరిపిన హింసాత్మక చర్యలను నిరసిస్తున్నాం. భారత శాంతియుత సామాజిక వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసే ఈ చట్టాలను రద్దుచేయాలని కోరుతున్నాం.

కె.శ్రీనివాస్, ఎస్.వీరయ్య, కట్టా శేఖర్ రెడ్డి, అల్లం నారాయణ, కె.శివారెడ్డి, దేవి ప్రియ, నిఖిలేశ్వర్, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, భూపతి వెంకటేశ్వర్లు, ప్రొ. జి హరగోపాల్, ప్రొ. జయధీర్ తిరుమలరావు, ప్రొ.సి కాశిం,ప్రొ.పద్మజ షా, ప్రొ.కాత్యాయని విద్మహే,,ప్రొ.సూరెపల్లి సుజాత, ప్రొ. ఎమ్. వినోదిని. అల్లం రాజయ్య, వై.కరుణాకర్, అఫ్సర్, యాకూబ్, షాజహాన, స్కైబాబ, వెంపల్లె షరీఫ్‌, కవి జయరాజ్, విమల, జూపాక సుభద్ర, మెర్సి మార్గరెట్, డా.పసునూరి రవీందర్, డా.సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, పి.విజయ్ కుమార్, డా. జిలుకర శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్, శిలాలోలిత, కుప్పిలి పద్మ, కె.ఎన్.మల్లీశ్వరి, దాసోజు లలిత, కాత్యాయని, ఎస్.జె.కళ్యాణి, అరణ్య కృష్ణ, వెంకట క్రిష్ణ, శోభ భట్, డా.గుర్రం సీతారాములు, డా. గాదె వెంకటేష్, విజయ్ సాధు, డా.కాసుల లింగారెడ్డి, పి.వరలక్ష్మి, పాణి, అనిల్ డాని, నరేష్ సూఫీ, దేశరాజు, ఛాయ మోహన్ బాబు, సజయ కాకరాల, సత్యవతి కొండవీటి, శివరాత్రి సుధాకర్, వనపట్ల సుబ్బయ్య, బాల సుధాకర్ మౌళి, రాఘవ రామిరెడ్డి, గురిజాల రవిందర్, అరసవెల్లి కృష్ణ, కోర జాన్, ఇంద్రవెల్లి రమేష్, ఎమ్.ఎ.బాసిత్, సాబీర్ హుస్సేన్, విప్లవ్ కమార్, బమ్మిడి జగదీశ్వర రావు, దాసోజు కృష్ణమాచారి, బర్ల మహెందర్, వెంకటాద్రి శిలపాక, షేక్ పీర్ల మహ్మద్, పి.మోహన్, శోభరాజు, అన్వర్ వరంగల్, కొడం కుమారస్వామి, నల్లెల రాజయ్య, కూర్మనాథ్‌, విజయ్ చంద్ర, రాంకి, నల్లూరి రుక్మిణి, జుగాష్ విలి, వేల్పుల నారాయణ, తదితరులు.

Courtesy Andhrajyoth

Leave a Reply