మూడు జిల్లాల్లో.. ఆహారం వికటించి 143మంది విద్యార్థులకు అస్వస్థత

0
270

ఆదిలాబాద్‌ టౌన్‌/తాంసి/అడ్డాకుల/ధర్మారం/కేటీదొడ్డి : ఆహారం వికటించి.. కలుషిత నీరు తాగి రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లోని 143 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకున్నారు. మధ్యాహ్నం ఒక్కొక్కరిగా మొత్తం 46మంది కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. సిబ్బంది వారిని రిమ్స్‌కు తరలించారు. తాంసి మండలంలోని గోట్కూరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తర్వాత 27మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యా రు. వారిని వెంటనే రిమ్స్‌కు తరలించారు. అలాగే.. మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దమునుగాల్‌చెడ్‌ పాఠశాలలో బుధవారం మధ్యా హ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. అడ్డాకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. 11 మందికి ప్రథమ చికి త్స నిర్వహించి ఇంటికి పంపారు.

17 మం దిని మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అడ్డాకుల ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం దగ్గర వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం జడ్పీ ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు తాగి 38 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని కొండాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తర్వాత నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏఎన్‌ఎం పాఠశాలకు వచ్చి విద్యార్థులను పరీక్షించి మందులను ఇచ్చారు.

Courtesy Andhrajyothi

Leave a Reply