రెండేండ్లలో లిక్కర్ సేల్స్ రూ. 54 వేల కోట్లు

0
163
  • పోయిన ఎక్సైజ్​ పాలసీ టర్మ్​కన్నా రూ. 14 వేల కోట్లు ఎక్కువ 
  •     అమ్మకాల్లో రంగారెడ్డి టాప్.. తర్వాత నల్గొండ
  •     వచ్చే నెల నుంచి కొత్త పాలసీ రూ. 70 వేల కోట్ల సేల్స్​అంచనా
  •     ఇప్పటికే 159 కొత్త బార్లకు పర్మిషన్​.. 
  •     తాజాగా 404 వైన్స్​లకూ..

రాష్ట్రంలో లిక్కర్​ సేల్స్​ఏటా పెరుగుతున్నాయి. ఈ రెండేండ్ల ఎక్సైజ్ ​పాలసీ టైమ్​లో రూ. 54,583 కోట్ల లిక్కర్​ సేలైంది. అంతకుముందు ఎక్సైజ్​పాలసీ టైమ్​తో పొలిస్తే రూ. 13,746 కోట్ల సేల్స్​ఎక్కువగా జరిగాయి. వీటికి ఎక్సైజ్ ట్యాక్స్, అప్లికేషన్ ఫీజు అదనం. వచ్చే నెల నుంచి కొత్త పాలసీ స్టార్టవుతోంది. తర్వాతి రెండేండ్లకు రూ. 70 వేల కోట్ల సేల్స్​జరుగుతాయని అంచనా అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది.

రెండేండ్లకోసారి పాలసీ
రాష్ట్రంలో రెండేండ్లకోసారి ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీ మారుతుంది. వైన్స్‌‌‌‌ ఓనర్లకు రెండేండ్లకు లైసెన్స్‌‌‌‌ ఇస్తారు. 2019‌‌‌‌‌‌‌‌‑–2021 ఎక్సైజ్‌‌‌‌ పాలసీ 2019 నవంబర్‌‌‌‌ ఒకటి నుంచి 2021 అక్టోబర్‌‌‌‌ 31వరకు ఉంది. అయితే కరోనా, ఇతర కారణాలతో నెల పొడిగించారు. 2019 నవంబర్‌‌‌‌ నుంచి 2021 అక్టోబర్‌‌‌‌ వరకు రాష్ట్రంలో 54,583 కోట్ల లిక్కర్‌‌‌‌ అమ్ముడైంది. మొదటి సంవత్సరంలో 29,836 కోట్లు, రెండో సంవత్సరంలో 24,747 కోట్లు వచ్చాయి. 7 కోట్ల కేసుల ఐఎంఎల్‌‌‌‌ (ఇండియన మేడ్‌‌‌‌ లిక్కర్‌‌‌‌), 6.3 కోట్ల కేసుల బీర్లు అమ్మారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రెండేండ్లలో రూ. 12,179 కోట్ల మద్యం తాగారు. తర్వాత నల్గొండలో రూ. 5,982 కోట్లు, హైదరాబాద్‌‌‌‌లో రూ. 5,821 కోట్లు, మెదక్‌‌‌‌లో రూ. 4,277 కోట్ల సేల్స్​జరిగాయి. 2017–19 ఎక్సైజ్‌‌‌‌ పాలసీలో రూ. 40,837 కోట్ల సేల్స్​జరిగాయి.

రెండేండ్లలో రెండుసార్లు పెంపు
ప్రస్తుత ఎక్సైజ్‌‌‌‌ పాలసీలో రెండు సార్లు లిక్కర్‌‌‌‌ రేట్లు పెంచారు. సుమారు 40 శాతానికి పైగా ధరలు పెంచేశారు. 2019 డిసెంబర్‌‌‌‌లో 20 శాతం, 2021 కరోనా టైమ్​లో పాండమిక్‌‌‌‌ సెస్‌‌‌‌ పేరుతో మరో 22 శాతం దాకా ధరలను పెంచారు. అన్ని రాష్ట్రాల్లో పెంచిన కరోనా సెస్‌‌‌‌ తగ్గించినా తెలంగాణ మాత్రం అలాగే కంటిన్యూ చేస్తోంది.

కరోనా టైంలో మస్తు సేల్స్​
లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో 2020 మార్చి 22 నుంచి మే 5 వరకు వైన్స్‌‌‌‌లు బందయ్యాయి. మే 6 నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయినా 2020లో లిక్కర్‌‌‌‌ ఆదాయం బాగా వచ్చింది. సేల్స్‌‌‌‌ కాస్త తగ్గినా రేట్లు పెంచడంతో ఇన్‌‌‌‌కం తగ్గలేదు. 2020 ఏప్రిల్‌‌‌‌ నుంచి 2021 మార్చి వరకు రూ. 27.28 కోట్ల లిక్కర్‌‌‌‌ సేలైంది. ఇందులో డిసెంబర్‌‌‌‌ నెలలో అత్యధికంగా మందు అమ్ముడైంది. ఈ నెలలో రూ. 2,765.5 కోట్ల మద్యం డిపోల నుంచి సరఫరా అయింది.

కొత్తగా 404 వైన్స్​లు, 159 బార్లు
డిసెంబర్‌‌‌‌ ఒకటి నుంచి కొత్త ఎక్సైజ్‌‌‌‌ అమల్లోకి రానుంది. ప్రస్తుతం లైసెన్స్‌‌‌‌ జారీ ప్రాసెస్‌‌‌‌ కొనసాగుతోంది. ఈ పాలసీ టైమ్​లో మరింత ఆదాయం రాబట్టేందుకు ఆబ్కారీ శాఖ ప్లాన్‌‌‌‌ చేసింది. ప్రస్తుతమున్న 2,216 వైన్స్‌‌‌‌లకు అదనంగా 404 కొత్త వాటికి పర్మిషన్ ఇవ్వడంతో మొత్తం వీటి సంఖ్య 2,620కి చేరింది. ఇటీవల 159 బార్లకు కొత్తగా అనుమతిచ్చారు. దీంతో కొత్త ఎక్సైజ్‌‌‌‌ పాలసీలో రెండేండ్లకు కలిపి రూ. 70 వేల కోట్ల విలువైన లిక్కర్‌‌‌‌ సేల్‌‌‌‌ అవుతుందని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Courtesy V6velugu

Leave a Reply