కొవిడ్‌ను జయించిన 25 రోజుల పసికందు

0
26

ఒడిశాలో 25 రోజుల పసికందు కొవిడ్‌ను జయించింది. కలహండి జిల్లా మదనపూర్‌ రాంపూర్‌ ప్రాంతానికి చెందిన మహిళ ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాక.. శిశువు తండ్రి, తాతయ్యకు అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులందరూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ వైరస్‌ సోకినట్లు తేలింది. అయిదు రోజుల పసికందుకూ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అంతా కలిసి భవానిపట్నాలో ఉన్న ఐసొలేషన్‌ కేంద్రంలో చేరారు. అక్కడి నుంచి వీరిని భువనేశ్వర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు 20 రోజుల పాటు చికిత్స పొందారు. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో వీరు కరోనా నుంచి కోలుకున్నట్లు తేలింది. శిశువును ఐసీయూలో ఉంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వైద్యం అందించామని, నెగెటివ్‌గా తేలడంతో గురువారం డిశ్ఛార్జి చేశామని వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె తాత, తండ్రి ఇంకా చికిత్స పొందుతున్నారు.

Courtesy Eenadu

Leave a Reply