ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41వేల ఖాళీలు..

0
532

– ఎస్‌బీఐలో అత్యధికం..

దేశంలోని 12 ప్రభుత్వ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లోక్‌సభలో అనుముల రేవంత్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. దేశంలో మొత్తం 12 బ్యాంకుల్లో 8,05,986 మంజూరు అయిన పోస్టులు కాగా, 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3,448 ఆఫీసర్ల పోస్టులు, 1,400 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మొత్తం 4,848 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3,528 ఆఫీసర్ల పోస్టులు, 1,726 క్లర్క్‌ పోస్టులు, 1,041 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మొత్తం 5,254 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

ఇండియన్‌ ఓవర్సిస్‌ బ్యాంకులో 1,242 ఆఫీసర్ల పోస్టులు, 2,058 క్లర్క్‌ పోస్టులు, 1,812 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మొత్తం 5,112 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 1,210 ఆఫీసర్ల పోస్టులు, 716 క్లర్క్‌ పోస్టులు, 4,817 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మొత్తం 6,743 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. యూకో బ్యాంక్‌లో 1,078 ఆఫీసర్ల పోస్టులు, 1,336 క్లర్క్‌ పోస్టులు, 1,313 సబ్‌ స్టాఫ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మొత్తం 3,727 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కెనరా బ్యాంక్‌లో 761 ఆఫీసర్‌, 564 క్లర్క్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇండియన్‌ బ్యాంక్‌లో 733 ఆఫీసర్‌, 1,412 క్లర్క్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పంజాబ్‌ అండ్‌ సిండ్‌ బ్యాంక్‌లో 728 ఆఫీసర్‌, 407 క్లర్క్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3,523 ఆఫీసర్‌, 5,121 క్లర్క్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. యూనియర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1,024 ఆఫీసర్‌, 74 సబ్‌ స్టాప్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 15 ఆఫీసర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 190 ఆఫీసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

Courtesy Nava Telangana

Leave a Reply