మైనర్‌ వివాహితపై.. 6 నెలల్లో 400 మంది అత్యాచారం!?

0
156
  • మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో దారుణం
  • బాలిక ఫిర్యాదు… ముగ్గురి అరెస్టు

బీడ్‌ (మహారాష్ట్ర)  : మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో దారుణం జరిగింది. గత ఆరు నెలల్లో దాదాపు 400 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసుశాఖలో పనిచేసే ఓ వ్యక్తి కూడా లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. ఈమేరకు కేసును నమోదు చేసిన బీడ్‌ జిల్లా పోలీసులు, ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రెండు,మూడేళ్ల క్రితం ఈ బాలిక తల్లి చనిపోయింది. దీంతో ఎనిమిది నెలల క్రితం ఆమెకు తండ్రి పెళ్లి చేశాడు. వివాహం తర్వాత భర్త, అత్తింటివారి వేధింపులు తాళలేక బాలిక ఇంటికి తిరిగొచ్చింది. అయితే ఇంట్లోకి రానిచ్చేది లేదని బాలికకు తండ్రి స్పష్టం చేశాడు. దీంతో ఆమె బీడ్‌ జిల్లాలోనే ఉన్న అంబాజోగై పట్టణ బస్టాండ్‌ వద్ద భిక్షాటన చేస్తూ రోజులు గడపసాగింది. భిక్షాటన ప్రారంభించినప్పటి నుంచే తనపై అత్యాచారాలు జరగడం మొదలైందని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. ఈవిషయాన్ని చెప్పేందుకు తాను ఎన్నోసార్లు అంబాజోగై పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేసింది. పైగా అక్కడి పోలీసు సిబ్బంది నుంచి వేధింపులు ఎదురయ్యాయని తెలిపింది. ఎట్టకేలకు ఈవారం పోలీసులు కేసు నమోదు చేయడంతో దారుణం వెలుగుచూసింది.

Leave a Reply