యువతిపై 60 మంది అత్యాచారం!

0
365

కందర్‌బేరా: ఝార్ఖండ్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తనను అపహరించి నెలరోజుల పాటు బంధించి 60 మంది దుండగులు అత్యాచారం చేసినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం చేసేవారని, మాట వినకపోతే కొట్టి హింసించేవారని చెప్పింది. సరాయ్‌కేలా-ఖర్‌సావా జిల్లాలోని కందర్‌బేరా సమీపంలో మూతపడిన గ్యారేజ్‌లో ఇన్నాళ్లు బంధించారని, గురువారం బహిర్భూమికి వెళ్లాలని చెప్పి వారి నుంచి తప్పించుకొని వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు అనారోగ్యంతో ఉందని, సరిగా మాట్లాడలేకపోతోందని పోలీసులు చెప్పారు. తనను ఎప్పుడు, ఎలా అపహరించారనే వివరాలు కూడా ఆమె చెప్పలేకపోతోందని తెలిపారు.

Courtesy Eenadu

Leave a Reply