రైతుకు కష్టం.. కార్పొరేట్లకు దాసోహం…!

0
318

బీజేపీ విచ్ఛిన్న కుట్రలెన్నో…
బడా సంస్థలతో రైతు బేరసారాలు చేయగలడా?
సేద్యంపై గద్దల కన్ను

న్యూఢిల్లీ :ఎన్డీయే సర్కార్‌ తెచ్చిన వ్యవసాయ చట్టాలవల్ల తమకు ఒరిగేదేమీలేదనీ, కార్పొరేట్‌ సంస్థలకే మేలు చేస్తాయని రైతులు అంటున్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఈ చట్టం అవకాశం ఇస్తున్నా.. ఎంత మంది రైతులు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి విక్రయించగలరని ప్రశ్నిస్తున్నారు. కేవలం కార్పొరేట్‌, బహుళ జాతి కంపెనీలు.. వాటి ఏజెంట్లు రైతుల నుంచి కొనుగోలుచేసి ఆ తరువాత రాష్ట్రాలు దాటిస్తూ వ్యాపారం చేసుకుంటాయనటంలో సందేహంలేదు. నూనెగింజలు, పప్పుధాన్యాలు వంటి ఉత్పత్తుల చేతుల్లో ఉండగా.. ఇకపై దేశంలోని అన్ని వ్యవసాయ ఉత్పత్తులకీ అదే గతి పడుతుందని రైతులు అంటున్నారు. మరోవైపు రైతు ఉద్యమాన్ని నీరుగార్చేలా మోడీ సర్కార్‌ చర్చలకు అన్నదాతలు అంగీకరించారంటూ శకుని రాజకీయాన్ని తెరపైకి తెస్తున్నది.

రిలయన్స్‌ ఆగ్రో టెక్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ అగ్రో ట్రేడింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ అగ్రోఫుడ్‌ ఇండిస్టీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ అగ్రోనిక్స్‌ పీవీటీ లిమిటెడ్‌, రిలయన్స్‌ అగ్రోటెక్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఫ్రెష్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ డెయిరీ ఫుడ్స్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ హైపర్‌మార్ట్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి సొల్యుషన్స్‌ లిమిటెడ్‌, డిలైట్‌ ప్రోటీన్స్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఎఫ్‌ అండ్‌ బి సర్వీసెస్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ అగ్రి ప్రొడక్ట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ న్యూట్రిషనల్‌ ఫుడ్‌ ప్రాసెసర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ ల్యాండ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, అదానీ విల్మార్‌ లిమిటెడ్‌, అదానీ అగ్రి-లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌, అదానీ ఫార్మ్‌-పిక్‌, అదానీ అగ్రి ఫ్రెష్‌ లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (బర్నాలా) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (బతిండా) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (బోరివాలి) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (దాహౌడ్‌) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (దర్భంగా) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (దేవాస్‌) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (ధమోరా) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (హౌషంగాబాద్‌) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (కన్నౌజ్‌) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (కతిహార్‌) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (కోట్కపురా) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (మాన్సా) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (మోగా) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (ఎంపీ) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (నాకోదర్‌) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (పానిపట్‌) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (రామన్‌) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (సమస్తిపూర్‌) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (పాట్నా) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ (ఉజ్జయిన్‌) లిమిటెడ్‌, అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌, పతంజలి నాచురల్‌ బిస్కెట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, పతంజలి నాచురల్‌ కలరోమా ప్రయివేట్‌ లిమిటెడ్‌, పతంజలి నాచురల్‌ కమోడిటీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, పతంజలి నాచురల్‌ ఎడిబుల్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, పతంజలి నాచురల్‌ ఫుడ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, పతంజలి నాచురల్‌ ప్రొడక్ట్స్‌ ఎల్‌ఎల్‌పీ, పతంజలి ఫుడ్‌ అండ్‌ హెర్బల్‌ పార్క్‌ జమ్ము ప్రయివేటు లిమిటెడ్‌, పతంజలి ఫుడ్‌ అండ్‌ హెర్బల్‌ పార్క్‌ నాగపూర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, పతంజలి ఫుడ్‌ అండ్‌ హెర్బల్‌ పార్క్‌ నోయిడా ప్రయివేట్‌ లిమిటెడ్‌, పతంజలి ఫుడ్‌ అండ్‌ హెర్బల్‌ పార్క్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ యూకే, పతంజలి ఫుడ్‌ అండ్‌ హెర్బల్‌ పార్క్‌ ఆంధ్రా శాన్‌స్తాన్‌, పతంజలి ఫుడ్‌ అండ్‌ హెర్బల్‌ పార్క్‌ బుందేల్‌ఖండ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, పతంజలి అగ్రో ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌, పతంజలి ఆగ్రో రివల్యూషన్‌ ప్రయివేటు లిమిటెడ్‌, పతంజలి వ్యవసాయ పరిశోధన వంటి కార్పొరేట్‌ సంస్థలు వాటి ఏజెంట్లు రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి.

అయితే, ఈ పెద్ద సంస్థలతో రైతులు బేరసారాలు చేయగలడా? చర్చలు జరపగలడా? గిట్టుబాటుధర వస్తుందా? కనీసం పెట్టిన పెట్టుబడైనా అన్నదాతల చేతికి అందుతుందా? దేశ ప్రజలరా.. ఒక్కసారి ఆలోచించండి.

Courtesy Nava Telangana

Leave a Reply