ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్య

0
313

ముంబై : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న ఐశ్వర్యరాయ్‌(46), ఆమె కుమార్తె ఆరాధ్య(8) శుక్రవారం ఆస్పత్రిలో చేరారు. వైరస్‌ లక్షణాలు స్పల్పంగా కనిపించడంతో నిన్న సాయంత్రం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈనెల 12 ఐశ్వర్యర్యాయ్‌, ఆరాధ్యకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వైరస్‌ లక్షణాలు లేకపోవడంతో గత అయిదు రోజులుగా వైద్యుల సూచనతో వారు ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు.

మరోవైపు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కొడుకు సైతం జూలై 11న కరోనా బారిన పడి నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కరోనా తేలినప్పటి నుంచి బిగ్‌బీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఆరోగ్య సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. తాము త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్న అభిమానులు, సన్నిహితులందరికి బిగ్‌బీ ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

Courtesy Sakshi

Leave a Reply