- నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్తత
- బస్సు అద్దాలు పగులగొట్టిన ఆందోళనకారులు
భైంసా క్రైం : నిర్మల్ జిల్లా భైంసాలో ఆదివారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం చేతులు, కళ్లద్దాలను గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మూడు బస్సుల అద్దాలు పగులగొట్టారు. ఏఎస్పీ కిరణ్ కారే ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. పట్టణంలో 144 సెక్షన్ విధించామని చెప్పారు.