మీ సంస్కారానికి వందనం

0
246

రాజస్థాన్ లోని సికర్ జిల్లా లోని పల్సారా గ్రామంలో కొంతమంది కార్మికులను ఒక పాఠశాల భవనంలో క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. తిని ఖాళీగా కూర్చోవడంతో విసుగెత్తిపోయింది. ఆ పాఠశాల భవనానికి ఎన్నో ఏళ్లుగా పెయింటింగ్ వేయలేదని ఆ క్వారంటైన్ లో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 54 మంది కార్మికులు గుర్తించారు. వాళ్ళు వెంటనే ఆ గ్రామ సర్పంచ్ తో పాఠశాల భవనానికి పెయింట్ వేస్తామని చెప్పారు. దాంతో ఆ సర్పంచ్ అవసరమైన వస్తువులు తెప్పించాడు. కార్మికులు తమ క్వారంటైన్ వ్యవధి ముగిసేలోగా భవనానికి పెయింట్ వేసేశారు.

ఆ పని చేసినందుకు ఆ గ్రామ సర్పంచ్ , వారికి డబ్బులివ్వబోతే, మాకు ఇన్నాళ్ళూ ఉచితంగా భోజనాలు పెట్టారు. అందుకుగాను మేమూ ఏదో ఒకటి చేయాలనుకున్నాము. పాఠశాల భవనానికి పెయింట్ వేసే అవకాశం లభించింది. మాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. అయినా మీరు ఏమైనా ఇవ్వదలచుకుంటే మీ ఊరి ఈ పాఠశాలకే ఇవ్వండి అని, డబ్బును నిరాకరించారు. తాము వెళ్లిపోయిన తర్వాత కూడా స్థానికులు తమను గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశామని కార్మికులు చెప్పారు. ఈ సమాచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కార్మికులపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదీ శ్రమజీవి సంస్కారమంటే, మీ సంస్కారానికి వందనం అంటూ అందరూ పొగడుతున్నారు.

Leave a Reply