యూపీలో మరో మైనర్ ప్రాణాలు బలి

0
99

– లైంగికదాడికి యత్నం..
– బాధితురాలు అరవడంతో ప్రాణాలు తీసి.. ఇంటిలో పూడ్చిన నిందితుడు

లక్నో: నిందితుడు లైంగికదాడకి యత్నించగా.. బాలిక అరవడంతో ఆమె ప్రాణాలు తీసి, ఇంటిలోనే గొయ్యితీసి అందులో పూడ్చిన దారుణ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని బులందర్‌ షహర్‌లో గత నెల 25న పొలం పనులు చేస్తున్న క్రమంలో ఓ మైనర్‌ బాలిక దాహం వేసి నీరు తాగడానికి ఇంటికి చేరుకుంది. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఈ క్రమంలోనే బాలిక కుటుంబం ఎంత వెతికిన దొరకకపోవడంతో మిస్సింగ్‌ కేసును నమోదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. ఓ ఇంటివద్ద ఓ గొయ్యి తవ్వినట్టు గుర్తించారు. అందులో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన హరేంద్ర అనే నిందితుడిని సిమ్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ”బాలిక నీరు తాగడానికి తమ ఇంటికి వచ్చిందనీ, ఈ క్రమంలోనే ఆమెపై లైంగికదాడి చేయడానికి యత్నించగా.. అరవడంతో ప్రాణాలు తీసినట్టు” నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు.

కాగా, యూపీలో మైనర్‌ బాలికలపై అఘాయిత్యాలు, దాడుల నిత్య చేసుకోవడం రాష్ట్రంలో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. మార్చి 1న అలీఘర్‌లో పంటపొలంలో 16 ఏండ్ల ఓ బాలిక మృతదేహం లభ్యమైంది. ఫిబ్రవరి 17న ఉన్నావోలో ముగ్గురు బాలికలపై విషప్రయోగం జరిగింది. ఇందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం బండా జిల్లాలో 14 ఏండ్ల బాలికపై లైంగికదాడి యత్నం జరిగింది. ఉన్నావోలో ఇదివరకు లైంగికవేధింపులకు గురైన బాలికకుటుంబంపై జైలు నుంచి వచ్చిన నిందితుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మరణించారు.

Courtesy Nava Telangana

Leave a Reply