- 48 గంటల్లో 2 సార్లు ధరల పెంపు
- మొత్తంగా 75ు అదనపు భారం
- కొన్ని బ్రాండ్లపై వంద శాతం
- ప్రీమియం బ్రాండ్లపై మాత్రం తక్కువే
- చీప్, మీడియంపైనే అధిక భారం
అమరావతి : మందుబాబులకు ప్రభుత్వం చుక్కలు చూపింది. ధరల మోతతో మందు తాగకుండానే కిక్కెక్కించ్చింది. సోమవారం 25ు ధరలు పెంచిన ప్రభుత్వం, 48 గంటలు తిరగకుండానే మరో 50ు పెంచేసింది. దీంతో మద్యం ధరలు పెరిగిపోయాయి. కరోనా ఉన్నా సోమవారం మద్యం షాపులు తెరవడంతో సర్వత్రా వచ్చిన విమర్శలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీంతో ప్ర భుత్వం ఆలోచనలో పడింది. మంగళవారం ఉదయాన్నే సీఎం జగన్ ధరలు ఇంకా పెంచాలని, వెం టనే అమల్లోకి తేవాలని చెప్పడంతో 11 గంటలకు తెరవాల్సిన షాపులను తీయకుండా ఆపారు. మధ్యా హ్నం కల్లా కొత్తగా 50ు ధరలు పెంచి ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి షాపులు తెరవాలని ఆదేశించారు. 2 విడతల్లో కలిపి ధరలు 75ు పెరిగాయని అధికారులు తెలిపారు. కాగా, కొన్ని బ్రాం డ్లపై 100ు ధరలు పెరిగాయి. అయితే, కొన్ని ప్రీ మియం బ్రాండ్లపై 30ు మాత్రమే పెరిగాయి.
ఉదాహరణకు రూ.60 ఉన్న సీసా తాజాగా రూ.120 అయ్యింది. అదే రూ.2,590 ఉన్న సీసా ధర రూ.3,310కు(28ు) పెరిగింది. కొన్ని చీప్ లిక్కర్ బ్రాండ్లు రూ.60 నుంచి రూ.110కి పెరిగాయి. చీప్ లిక్కర్, మీడియం బ్రాండ్లపైనే ధర పెరుగుదల ఎ క్కువగా ఉంది. క్వార్టర్ రూ.150 కంటే ఎక్కువ ఉన్న బ్రాండ్లను మూడో కేటగిరీ కింద చేర్చారు. ఇందులో ఒక్కో ఫుల్ బాటిల్‌పై రూ.480 పెరుగుతోంది. అంటే ఫుల్ రూ.వెయ్యి అయినా, రూ.రెండు వేలు అయినా రూ.480 పెరిగింది. మద్యం విలువ ఆధారంగా ఐదు రకాలుగా వర్గీకరించి ధరలు పెంచారు.
రూ.27 కోట్ల అమ్మకాలు..
కాగా, పెరిగిన ధరలతో మద్యం అమ్మకాలు పడిపోయాయి. సోమవారం రూ.68 కోట్ల అమ్మకాలు జ రిగాయని అధికారులు తెలిపారు. కానీ, మంగళవా రం రూ.27 కోట్లకే అమ్మకాలు పరిమితమయ్యాయి. సాయంత్రం అనేక చోట్ల షాపులు వెలవెలబోయా యి. అయుతే మంగళవారం తక్కువ షాపులే పనిచేశాయి. కలెక్టర్లు అనుమతి ఇవ్వకపోవడంతో 1500 షాపులే తెరుచుకున్నాయి. మద్యం అమ్మకాలను త గ్గించడంలో భాగంగా షాపుల సంఖ్య తగ్గిస్తారనే ప్రచారంపై నేడు స్పష్టత రానుంది. ఈ నెలాఖరుకు 15శాతం షాపులు తగ్గుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, దానిపై ఇంకా స్పష్టత రాలేదని, బుధవారం సీఎంతో జరిగే సమావేశంలో స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు.
అదనపు ఆదాయం 10వేల కోట్లపైనే!
తాజాగా ధరలు పెంచడం వల్ల మొత్తంగా ఈ ఏడాదిలో మద్యం ద్వారా ఎక్సైజ్‌కు రూ.10వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
Courtesy Andhrajyothi