బడుగుల ఆత్మగౌరవ పోరాట పతాక ఉ.సా.

0
386

వేదన రోదన నుంచే సహజత్వం ఉద్భవిస్తుంది. సహజత్వం నుంచి వచ్చేమాట, పాట, ఉపన్యాసం, ఉద్యమం, కళలు కవిత్వం, పెన్ను, గన్ను కలకాలం జీవిస్తాయి. సమస్య ఉన్నంతవరకు రాణిస్తాయి. నిలబడి కలబడతాయి, ప్రజాపక్షం వహిస్తాయి. పీడిత ప్రజల దక్సూచి, ఆత్మగౌరవ పోరాటాల దృవతార ఉసా కరోనా కాటుకు భలై మరణించటం విషాదం.

నాలుగున్నర దశాబ్ధాలుగా వాయిస్ఆఫ్ వాయిస్లెస్గా ఉన్నా ఆయన గొంతు మూగపోయింది. బలమైన బలహీనవర్గాల గొంతు ఉ. సాంభశివరావు ఆకస్మక మరణం తెలగు రాష్ట్రాలలో ఉద్యమకారులను, మేధావులను, దిగ్బ్రాంతికి గురిచేసింది. ఉ. సాంబశివరావు నిజాయితీ, చిత్తశుద్ధి కలిగిన మచ్చలేని నాయకుడు. నిరంతర, సుదీర్గపోరాటాలతో, ఉపన్యాసాలతో తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేశారు. సమకాలీన చరిత్రలో ఆయన పనిచేయని ఉద్యమంలేదు. చుండూరు, కారంచెడు నుంచి మోదలుకుని, మండల్కమిషన్, మోత్కూర్ రైతులు, మహబూబ్నగర్ కరవు, కొండమోదలు గిరిజనులు, మహిళలు, కులాంతర వివహలు, బలహీనవర్గాలపై దాడులు లాంటి ప్రతి అన్యాంపై బలహీనవర్గాలు,పీడితులు, అసంఘటిత రంగాల పక్షాలకు దైర్యం యిచ్చారు. దన్నుగా నిలిచారు. ఎమర్జీన్పీలో జైలుకూడ వెళ్ళారు.

ఉ. సాంబశివరావు గుంటూరు జిల్లా, పాత పొన్నేకల్లు తాలూక బ్రహ్మణకోడూర్లో 1951 లో బలహీనవర్గానికి చెందిన నిరుపేద మంగలి కుటుంబంలో జన్మంచారు. తెనాలిలో డిగ్రీవరకు చదదువుకున్నారు. ఉసా విద్యార్దీ దశ నుండి చురుకైన విద్యార్దీ, హేతువాదభాలు కలిగి ఉండేవారు. విద్యార్దీదశనుండే రచనలు చేసేవారు. కాలేజీ టైమ్లోనే భాస్కరరావు నాయకత్వంలోని వామపక్ష విద్యార్ధి సంఘం OPDR తో సన్నహిత సంభందాలు, అరువాత తెలంగాణ OPDRకు కిలక నాయుకుడయ్యరు. తరిమిల నాగిరెడ్డి నాయకత్వంలో UCCRI-(ML) పార్టీలో చేరి పశ్చమగోదవరి జిల్లా కొండమోలులో గిరిజన హక్కుల కోసం 1980 నుండి ఐదేండ్లు మహబూబ్‌నగర్‌లో కరవు పరిస్థితులకు చలించి, కంచె ఐలయ్యతో కలసి నాలుగు గ్రామాలలో పేదలకు నాలుగు సంత్సారాలు భోజన కేంద్రాలు ఏర్పాటు చేశారు. పనిచేశారు. సిద్దంతపరమైన విభేదాలతో పార్టీని విడారు. ఉద్యమాలలోనే ఉన్న తన సహచరి బ్రాహ్మణ యువతిని లక్ష్యిని వివాహమాడారు. తన కూతురు పాలడబ్బాలకు కూడ పాల డబ్బాలకు డబ్బులులేని దుర్భర పరిస్థితులు గడపారు ఉసా. ఈ స్థితిఇలో వొకరు ఉద్యమం, వొకరు ఉద్యోగం చెయ్యాలని నిర్ణయించుకుని లక్ష్మి పోటీ పరీక్షరాసి కమర్శియల్ టాక్స్ ఆఫీసర్ ఉద్యోగం సంపాదించి, కుటుంబ భారం మోస్తూ, సమాజానికి ఉద్యమాల ఉపాధ్యాయుడిని మంచి నాయకుడిని, ప్రజానాయకుడిన అందిచిన ఘనత ఆయన భార్యలక్ష్మీదే అని చెప్పాలి. తన సహచరి రిటైరైన తరువాత 2015లో హఠాత్తుగా మరణించటంతో, ఒంటరి జీవితం గడుపుతున్నరు ఉసా. తన కూతురు హిమబిందు డిల్లీలోని IAS కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు.

1985లో జరిగిన చుండూరు, కారంచెడు ఉద్యమాలలో ఉసా ప్రధాన భూమిక పోషించారు. భాదితలు పక్షాన బలంగా తన గొంతు వినిపించారు. అమరులైన దళితుల సమాదులు రుధిరక్షేత్రం ఒంగోలలో ఏర్పాటుకు నాయకత్వం వహించారు. కారంచెడు, చుండూరు, ఘటనలపై తన అనుభావాలను “రణనినాదం” అనే పేరుతో పుస్తకాన్ని రాశారు. దళితులు, బీసీలు, ఆదివాసీలపై ఆయన రచనలు ఉద్యమాలకు రెడీరెఫరెన్స్ గ్రంధాలుగా, చరిత్రక డాక్యుమెంట్స్‌గా మిగిలిపోతాయి. పుస్తకజ్నానం, అనుభవజ్నానం (exposer qushent knolodge) ఉన్నభహుముఖ మేధావి ఉసా. ఆయన ప్రభావశీల ఉపన్యాసకుడుగా, నాయుకుడిగా సమాజామీద బలమైన ముద్రవేయడానికి కారణం, లోతైన మార్క్సజం అధ్యనమే, ఈ అధ్యనాన్నీ శాస్థ్రీంగా బహుజనవాదానికి అన్వయించటటానకే జీవితాంతం పరితపించారు. మార్క్స్ తాత్విక భూమిక, అంబేద్కర్ ఆలోచనతోనే బడుగుల జీవితాలలో వెలుగులు నిండుతాయని బలంగా ఆకాంక్షించి, దానికోసం నాలుగున్నర దశాబ్దాలు తుది శ్వాస వరకు పోరాడారు.

మూస ఆలోచనలతోఉన్న కమ్మూనిస్టులకు ఉసా కంటగింపు కూడా అయ్యారు. నాయకులు మేధావులు కాలేరు, మేధావులు నాయకులు కావటం భహు అరుదు. కానీ ఉసా మాత్రం మేధావి అయిన నాయకుడు, నాయుకుడైన మేధావి వేధిక ఏదైనా బలహీనవర్గాలు, పేదల అభివృద్ధే తన శ్వాసగా, ధ్యాసగా జీవితాంతం పరితపించారు. ఉసా ప్రయత్నంలో విజయం సాధించాడు. భావజాలవ్యప్తిలో నిరంతర శ్రామికుడు. మంద కృష్ణమాదిగతో కలసి మహాజన ఫ్రంట్ ఏర్పాటు చేసారు. ఉసా ప్రధానకార్యదర్సిగా, కృష్ణమాదిగ అద్యక్షులుగా ఏర్పాటు అయింది. అది ఎందుకో ముందుకు పోలేదు. ఎన్నికల అనంతరం కృష్ణమాదిగ రాజీనామా చేయడంతో అది ముగిసిన అధ్యాయం అయింది.

గౌతం అధ్వర్యంలో మహాజన పార్టీని ఉసా నెలకొల్పారు. అదీ కొంతకాలమే పనిచేసింది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుతో, అప్పటివరకు తనతో ఉన్నవారికి సిద్దాంతాలు చెప్పిన గౌతం ప్రజాసంఘాలలోపని చేయడానికి విముఖతచూపి ప్రజారాజ్యంలో చేరారు. ఆ మీటింగ్లోనే చిరంజీవి సమక్షంలో జండామీది ఎజెండా బలహీనవర్గాలదిగా, ఉండాలని ఉసా కోరారు. నల్లగొండ జిల్లా మోత్కూర్, రామన్నపేట ప్రాంతాలలో రైతులు, రైతుకూలీలు, కరెంట్ సమస్యలపై ఐదేండ్లు స్ధానికంగా అక్కడే ఉండి పనిచేశారు. వర్షాభావ పరిస్థితులు, కరవు, కరెంటు సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచెస్తున్ననేధ్యంలో. రైతతులు, రైతుకూలీలు, పేదల పక్షాన నిలబడి బలమైన ఉద్యమాలు నిర్మించారు. కరెంట్ బిల్లులు కట్టడంలేదని అధికారులు రైతుల డోర్లు పీక్కపోవాడాన్ని నిరశిస్తూ, చారిత్రాత్మకంగా వేలాది ఎడ్లబండ్ల ప్రదర్శన చేయించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉసాకి మంచి పట్టుంది. అంత్యక్రియలు కూడ మోత్కూరులో చెయ్యమని అక్కడి ప్రజలు కోరుకున్నారు.

గతతార్కిక భౌతికవాదంలాంటి, మార్క్సిజం లెనినిజం సాహిత్యాన్ని ఉసా విసృతంగా, పఠించి, పరిశోధించి బలహీనవర్గాల సమస్యల పరిష్కారానికి, అంబెద్కర్యిజం, మార్కుసిజాన్నా అన్వహించి కొత్తసిద్ధాంతానికి పునాదులువేసిన ఆరుదైన వ్యక్తిత్వం ఉసాది. వర్గదృక్పదమేకాదు కుల దృక్పదం ఉండాలన్నారు. కమ్మూనిస్టులకు కేవలం వర్గదృక్పదం ఉండటం వల్లనే, పాలకపక్షాలకు, పెద్దగా తేడా లేకుండా పోయిందని, అందువల్లనే విప్లవ కమ్మూనిస్టు, ప్రజాస్వామ్యకమ్మూనిస్టు పార్టీలలో నేటికి అగ్రకుల స్వామ్యంమే నడుస్తుందని ఉసా ఆవేదన చెందేవారు. ఈ అంతర్మదనంతో తన శిష్యుడు వీరన్నతో కలిసి ఇండయాలో ఏమీచెయ్యాలి అనే సిద్ధాంత గ్రందాన్ని విస్తృతంగా రూపొందిచారు. బహుజన మేధావి కంచె ఐలయ్య, ఉసా మార్గదర్శకత్వంలో, వీరన్ననాయకత్వంలో విప్లవపార్టీని ఏర్పాటుచేశారు. మార్క్సిజాన్ని బహుజవాదానికి అన్వయించిన ఈ లసిద్దదాంతం బలహీనవర్గాలలోకి బలంగా పోతుందని, ప్రజలకంటే ముందే, రాజ్యం పసిగట్టి వీరన్నని ఎన్కౌంటర్ చేసంది. వీరన్న వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించిన గొల్లకులం డోల్ దెబ్బ, తుడుందెబ్బ, ఎరుకల హక్కుల పోరాటసమితీ, గిరిజ ఉద్యమాలు వీరన్నతరువాత అంతగా ప్రభావం చూపలేక పోయాయి. ఒక్క యంఆర్పీఎస్ మాత్రమే, పటిష్టమైన నిర్మాణం ప్రభావశీలంగా పనిచేస్తుంది.

అస్తిత్వ ఉద్యమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఉసా, మీడియా ప్రపగాండకు ఏనాడు అర్రులు చాచలేదు. నిత్యం ప్రజల్లో కాకుండా పత్రిల్లో మాత్రమే ఉద్యమాలు చేసే ప్రజాసంఘాల ఊసరవెల్లులు కొందరు ఉసా కమిట్మెంట్ కాన్సెప్ట్టు, నిజాయితీ, చిత్తశుధ్దిని సిగ్గుపడాలి, పబ్లీసిటీని మార్కెటింగ్ మార్చుకుని, ఆర్ధికంగా అసమాన్యులుగా మారి సామాన్యమైన జీవితం గడుపుతున్నట్లు నటించే వారికి ఉసా జీవనం, జీవితం ఆదర్శంగా నిలుస్తుంది. మనిషి జీవనం జీవితం రోజురోజుకు మృగ్యమౌతున్న, ఈ పోటీ ప్రపంచంలో, కెరియరిజం, ఆపర్చునిజం పెరుగుతున్ననేద్యంలో, బతుకుదెరువు, ఉపాధి కే యువత పరిమితమౌతుంది. ఈ సంధికాలంలో ఉసా లాంటి వారి మరణం, ఉద్యమాల తరం వెళ్లిపోతుందనే ఆందోళన మేధావులను ఆలోచింపచేస్తుంది.ఉసా బావజాలన్ని, ఆలోచనవిదానాన్ని, భావితరాలకు అందించటమే, ఉసాకి యిచ్చే ఘనమైన నివాళి.

-సాదం వెంకట్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply