హిందువుల వల్లే సంతోషంగా ముస్లింలు

0
163
  • హిందు అనేది మతం కాదు.. ఓ సంస్కృతి: భాగవత్‌
  • హిందువుల వల్లే భారత్‌లో ముస్లింలు అత్యంత సంతోషంగా ఉన్నారని ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు.అన్ని రాష్ట్రాలకు చెందిన ఆర్‌ఎ్‌సఎస్‌, అనుబంధ సంస్థల ‘కార్యకారీ మండల్‌’ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం ఒడిసా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొందరు మేధావులతో మాట్లాడారు. ‘‘హిందు అనేది ఒక మతం, భాష కాదు. దేశం పేరు కూడా కాదు. హిందు అనేది భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరి సంస్కృతి. ఇది విభిన్న సంస్కృతులను అంగీకరిస్తుంది. యూదులకు ఆశ్రయం కల్పించిన ఏకైక దేశం భారత్‌. పార్సీలు భారత్‌లోనే తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరిస్తారు. మన దేశంలోనే ముస్లింలు అత్యంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మనం హిందువులం అని మోహన్‌ భగవత్‌ వివరించారు.
  • ముస్లింలను దిగజార్చలేరు: ఒవైసీ….హిందు పేరుతో భారత్‌లో తన చరిత్రను మోహన్‌ భగవత్‌ తుడిచిపెట్టలేరని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. హిందుయిజానికి అన్వయించి భారత్‌లో ముస్లింల సంస్కృతి, విశ్వాసాన్ని దిగజార్చలేరంటూ ట్వీట్‌ చేశారు. ఇతర దేశాల ముస్లింలతో పోల్చి ఇక్కడి ముస్లింల భారతీయను తగ్గించలేరని చెప్పారు. కాగా, మూక దాడిపై మోహన్‌ భాగవత్‌, కేథలిక్‌ సంఘాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూక దాడితో ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలకు సంబంధం లేదని, నిజానికి మూకదాడి అనే పదాన్ని తొలుత బైబిల్‌లోనే ప్రస్తావించారని భాగవత్‌ అన్నారు. దీనిపై అఖిల భారత కేథలిక్‌ సంఘం భగ్గుమన్నది. భాగవత్‌ బైబిల్‌ను సరిగ్గా చదవలేదని విమర్శించింది. మైనారిటీలను భాగవత్‌తో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా లక్ష్యంగా చేసుకున్నారని, ప్రధాని మోదీ మౌనం ద్వారా వారికి సహకరిస్తున్నారని విమర్శించింది.
  • Courtesy Andhrajyothi..

Leave a Reply