బిచ్చగాళ్ల బతుకులు మరీ ఘోరం

0
293

ఆకలికి అలమటిస్తున్న అభాగ్యులు
పట్టించుకునే నాధుడే కరువు

న్యూఢిల్లీ : కరోనా కట్టడికి కేంద్రం తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయంతో దేశంలో లక్షలాది మంది అభాగ్యులు ఆకలికి అలమటిస్తున్నారు. నిత్యం రోడ్ల పక్కన, ఇండ్ల ముందు యాచించే బిచ్చగాళ్ల పరిస్థితైతే మరీ దారుణంగా ఉంది. లాక్‌డౌన్‌తో ప్రజలెవరూ రోడ్లమీదికి రాకపోవడం.. బయట కనిపిస్తే పోలీసులు జైళ్లో వేస్తుండటంతో యాచకుల బతుకులు పెనం మీది నుంచి పొయ్యి మీద పడ్డాయి.

ఢిల్లీ సరిహద్దుల్లో ఘజియాబాద్‌ (యూపీ) జిల్లాలో ఉన్న వైశాలి మార్కెట్‌ సమీపంలో వేలకొద్ది యాచకులు నివసిస్తుంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఆ మార్కెట్‌ చాలా పెద్దదవండంతో అది నిత్యం రద్దీగా ఉంటుంది. గుండు సూది నుంచి ఎయిర్‌ కండిషనర్ల వరకూ ఆ మార్కెట్‌లో లభ్యమవుతాయి. రిక్షా తొక్కుకునేవాళ్లు, బస్తాలు మోసేవాళ్లు,చిరు వ్యాపారులతో పాటు వేలాది కార్మికులూ అక్కడ ఉపాధి పొందుతు న్నారు. అక్కడికి వచ్చే వారి దగ్గర్నించి యాచిస్తూ వేలాది మంది యాచకులు బతుకులీడుస్తుంటారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా కొద్ది రోజులుగా ఆ మార్కెట్‌ను మూసేశారు.

దీంతో యాచకులు ఎక్కడికి వెళ్లలేక, బయటకు వెళ్లే పరిస్థితుల్లేక పస్తులుంటున్నారు. వసతి గృహాల్లో ఉన్న కొద్దిమంది వలస కార్మికులకు ఆయా ప్రభుత్వాలు, ఎన్‌జీవోలు ఆహా రం పెడుతున్నా.. యాచకులను మాత్రం పట్టించుకునే నాధుడే కరువ య్యాడు. లాక్‌డౌన్‌తో ఆ అభాగ్యజీవుల బతుకులు మరింత దుర్భరమ య్యాయి. దేశంలో ఎవరినీ ఆకలితో ఉండనీయమనీ, అందరికీ ఆహారం అందిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా అవి వీరి దగ్గరకు రావడం లేదు.

Courtesy Nava Telangana

Leave a Reply