దళిత, బహుజన సాహిత్యానికి అమితాదరణ

0
114

దళిత, బహుజన, సాహిత్యం పట్ల యువతరంలో ఆదరణ పెరిగిం దనడానికి బుక్ ఫెయిర్లోని దళిత, బహుజన రచనలు నెలవైన స్టాళ్ల లోని సందర్శకుల సంఖ్యే నిదర్శనం. ముఖ్యంగా వివిధ వర్సిటీల విద్యా ర్థులు, యువ పరిశోధకులు పూలే, అంబేడ్కర్, పెరియార్, కాన్షీరాం రచనలను ఎక్కువగా తీసుకుంటున్నట్లు భూమి బుక్ ట్రస్ట్ నిర్వాహ కుడు శ్రీనివాస్ తెలిపారు. ‘ఎస్ఆర్ శంకరన్ జీవిత చరిత్రతో పాటు, అంబేడ్కర్ వ్యక్తిగత కార్యదర్శి నానక్ చంద్రరత్తు రాసిన ‘డా. అంబేడ్చు ర్తో స్మృతులు-జ్ఞాపకాలు, కులచరిత్రల పుస్తకాలు బాగా అమ్ముడవు

తున్నాయి. బహుజనులకు సంబంధించి నలభైకి పైగా టైటిల్స్ భూమి బుక్ ట్రస్టు ప్రచురించింది. గతంలో కంటే ఈ ఏడాది దళిత, బహుజన సాహిత్యానికి ఆదరణ మరింత పెరిగింది అని శ్రీనివాస్ వివరించారు. దళిత బహుజన సాహిత్యం. భూమి బుక్ ట్రస్ట్- 116, వీక్షణం ప్రచురణలు – 49, తెలంగాణ బుక్ ట్రస్ట్ – 200, స్కైబాబా బుక్స్ –  169, లోకాయత పబ్లికేషన్స్-75 తదితర స్టాళ్ళలో అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply