ముందే హెచ్చరించిన సామాన్యుడు

0
271
  • బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ లోపాలపై రెండుసార్లు ట్వీట్లు చేసిన విద్యాసాగర్‌
  • రంబ్లర్లను ఏర్పాటు చేయాలని కేటీఆర్‌కు ట్వీట్‌
  • అయినా స్పందించని ప్రభుత్వ యంత్రాంగం
  • తాజా ప్రమాదం తర్వాతే రంబ్లర్ల ఏర్పాటుకు నిర్ణయం

సార్‌ రాయదుర్గం నుంచి హైటెక్‌ సిటీ వైపు ఉన్న ఫ్లై ఓవర్‌ చాలా వంపుతో ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గుర్తించి డిజైన్‌లో మార్పులు తేవాలి

ఆగస్టు 21న.. అంటే బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవానికి రెండున్నర నెలల ముందు విద్యాసాగర్‌ జగదీశన్‌ అనే బ్యాంకు ఉద్యోగి.. పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు ట్విటర్‌ ద్వారా చేసిన అభ్యర్థన ఇది. వాళ్లు పట్టించుకోలేదు.

సార్‌ మీరు రేపు ప్రారంభించబోయే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌ మీద వంపు ఎక్కువగా ఉంది. రంబ్లర్స్‌ ఏర్పాటు చేయించండి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది

నవంబరు 3న.. అంటే ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవానికి ముందు రోజు కేటీఆర్‌ని ఉద్దేశించి మళ్లీ అదే విద్యాసాగర్‌చేసిన అభ్యర్థన ఇది. అయితే, ఎప్పుడూ ట్విటర్లో చురుగ్గా ఉండే కేటీఆర్‌ ఈ అభ్యర్థనకు మాత్రం స్పందించలేదు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌ నిర్మాణలోపాలపై ఒక సామాన్యుడు ఇలా రెండుసార్లు హెచ్చరించినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోని ఫలితం.. 20 రోజుల్లోనే ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అధికారులు ఇప్పుడు చర్యలు చేపడుతున్నారు. అ ప్పుడే స్పందించి ఉంటే ఐదుగురి ప్రాణాలు మిగిలేవని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌ సిటీ, ఆంధ్రజ్యోతి

ఇంజనీరింగ్‌ తప్పిదం

సెకండ్‌ లెవల్‌ ఫ్లై ఓవర్‌ వంపులు ఉండకూడదు. అలా నిర్మించడం ఇంజనీరింగ్‌ తప్పిదమే. చెన్నైలో కత్తిపర ఫ్లైఓవర్‌ సీతాకొకచిలుకలా ఉంటుంది. ఇందులో మొదటి లెవల్‌ ఫ్లైఓవర్‌లోనే వంపు ఉంటుంది.ఆ పై ఉండే వంతెనలో వంపులు ఉండవు.

విద్యాసాగర్‌

Courtesy Andhrajyothy

Leave a Reply