నిందితుల్లో ఐదుగురు మైనర్లు
కోదాడ రూరల్, న్యూస్‌టుడే: పదమూడేళ్ల బాలుడిపై ఆరుగురు వ్యక్తులు ఏడు నెలలుగా లైంగికదాడికి పాల్పడుతున్న ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోదాడలోని ఓ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అదే ప్రాంతానికి చెందిన పదమూడేళ్ల బాలుడిని ఈ నెల 18న క్రికెట్ ఆడుకుందామంటూ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే లైంగిక దాడి పాల్పడ్డారు. బాలుడి ప్రవర్తనలో మార్పు కనిపించడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. ఏడు నెలలుగా ఆరుగురు తనపై లైంగికదాడి చేస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లడిల్లారు. అదే రోజు బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశామని సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిందితుల్లో ఐదుగురు మైనర్లని, వారిని జువైనల్ జస్టిస్ బోర్డుకు తరలించామని, మరో నిందితుడు నవీన్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.
Courtesy Eenadu