భర్త కాదు.. సోదరుడట

0
25
  • ప్రేమించి పెళ్లిచేసుకున్నోడు అన్న
  • అవుతాడని తెలిసి విషంతాగిన యువతి 
  • పురుగు మందు తాగిన 
  • యువకుడు.. పరిస్థితి విషమం
  • నెలక్రితం పెళ్లి.. యువకుడి 
  • ఇంటి ముందు ఆందోళనలు
  • ఇల్లెందు మండలంలో ఘటన

ఇల్లెందురూరల్‌ : ప్రపోజ్‌ చేసి మరీ తనను పెళ్లి చేసుకున్న యువకుడు, తనకు అన్న వరస అవుతాడని తెలిసి మనోవేదనకు గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భార్య ఇకలేదని తెలిసి ఆ యువకుడు పురుగుల మందు తాగి, బావిలో దూకి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పెళ్లయిన నెలకే దంపతుల కథ ఇలా విషాదాంతమవ్వడంతో కుటుంబసభ్యులు కంటికీ మంటికి ధారగా రోదిస్తున్నారు. కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఈ ఘటన జరిగింది.  అక్కడి నెహ్రూనగర్‌ తండాకు చెందిన బోడ శ్వేత(20) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కరోనాతో ప్రత్యక్ష తరగతులు జరగకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో తన అక్క సరూతో కలిసి జాబ్‌ చేస్తోంది. అక్కడ ఆమెకు గతంలో పరిచయం ఉన్న గుగులోత్‌ వెంకటేశ్‌ (22) కలిశాడు. తన ఇంటి పేరు భూక్యా అని శ్వేతకు చెప్పి, తనను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్‌ చేశాడు. నెలక్రితం స్నేహితుల సమక్షంలో శ్వేత-వెంకటేశ్‌ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను స్నేహితుల్లో కొందరు వాట్సా్‌పలో పెట్టడంతో అమ్మాయి తల్లిదండ్రులైన బోడ సోమ్లా, శాంతకు కూతురు పెళ్లి గురించి తెలిసింది.

ఇద్దరు కుమార్తెలను సోమవారం ఇంటికి తీసుకొచ్చి వివాహం గురించి ఆరా తీశారు. శ్వేతను పెళ్లి చేసుకున్న వెంకటేశ్‌ ఇంటి పేరు వేరే అయినా గోత్రాలు ఒక్కటేనని, ఆమెకు అన్న వరుస అవుతాడని తెలుసుకుని అవాక్కయ్యారు. కుమార్తె శ్వేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపేరు భూక్యా అని చెప్పి తనను వెంకటేశ్‌ పెళ్లి చేసుకున్నాడని తల్లిదండ్రుల ముందు శ్వేత వాపోయింది. తాను అన్న వరుస అయిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని మనోవేదనకు గురైంది. తనను వెంకటేశ్‌ మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా? అని తీవ్రంగా ఆలోచించింది. సోమవారం ఇంట్లో అంతా నిద్రించిన తర్వాత పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంట నే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందింది. ఇది తెలిసి వెంకటేశ్‌ తమ ఊరు కట్టుగూడెంలో పురుగుల మందుతాగి ఇంటి వెనుకనున్న బావిలో దూకాడు. అతడిని  ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం ప్రైవేట్‌ ఆస్పతిక్రి తరలించారు. మరోవైపు తమ కుమార్తె మృతికి వెంకటేశే కారణమంటూ శ్వేత కు టుంబ సభ్యులు, నెహ్రూనగర్‌ తండావాసులు కట్టుగూడెంలోని వెంకటేశ్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగడంతో పోలీసులు శాంతింపజేశారు.

Courtesy Andhrajyothi

Leave a Reply