రాష్ట్రంలో మెల్లగా నడుస్తున్న టీకాల పంపిణీ
ఇప్పటికీ 8.58 లక్షల మందికే వ్యాక్సిన్
దేశంలో 16వ స్థానంలో తెలంగాణ
ఇంకా అరకొరగానే సెంటర్లు.. గ్రామాల్లో మరీ తక్కువ
ముంచుకొస్తున్న కరోనా సెకండ్ వేవ్
హైదరాబాద్ : కరోనా టెస్టుల్లానే వ్యాక్సినేషన్‌లోనూ రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. టీకాలు వేయడం మొదలై రెండున్నర నెలలవుతున్నా ఇప్పటివరకు 8.58 లక్షల మందికే వేసింది. వ్యాక్సినేషన్‌లో దేశంలో 16వ ప్లేస్‌లో ఉంది. ఇప్పటికీ అరకొరగానే టీకాల పంపిణీ నడుస్తోంది. ఊర్లల్లో మరీ తక్కువగా సాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,58,260 మందికే వ్యాక్సిన్ వేయగా వేరే రాష్ట్రాల్లో రోజూ 50 వేల నుంచి లక్ష మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. గురువారం మన రాష్ర్టంలో 27,627 మందికి వ్యాక్సిన్ వేస్తే యూపీలో 1,63,983 మందికి వేశారు. కేరళ, మహారాష్ర్ట, గుజరాత్‌లోనూ రోజుకు లక్ష నుంచి లక్షన్నర మందికి వేస్తున్నారు. ఇప్పటివరకూ అత్యధికంగా మహారాష్ర్టలో 47.56 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు.
1,200 సెంటర్లన్నరు.. సగం కూడా లేవు
వృద్ధులు, కోమార్బిడ్ పేషెంట్లకు వ్యాక్సిన్ వేయడానికి 1,200 సెంటర్లను సిద్ధం చేశామని హెల్త్ ఆఫీసర్లు ప్రకటించారు. కానీ అందులో సగం సెంటర్లను కూడా అందుబాటులోకి తేలేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి టీచింగ్ హాస్పిటళ్ల వరకు 1,046 ప్రభుత్వ దవాఖాన్లలో సెంటర్లు పెడ్తామన్నారు. అందులో 400 సెంటర్లనే అందుబాటులోకి తెచ్చారు. వీటిని కూడా తగ్గిస్తున్నారే గాని పెంచట్లేదు. గురువారం హెల్త్ డిపార్ట్‌మెంట్ బులెటిన్ ప్రకారం బుధవారం 276 గవర్నమెంట్, 232 ప్రైవేట్ సెంటర్లలోనే వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న 8.58 లక్షల మందిలో 4.48 లక్షల మంది గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వాళ్లే. జిల్లాలు, గ్రామాల్లో ప్రైవేట్ సెంటర్లు లేవు. ప్రభుత్వ దవాఖాన్లున్నా సెంటర్లను ఏర్పాటు చేయలేదు. ఊర్లల్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి జనాలు రాకపోతే వ్యాక్సిన్ వేస్టేజ్ పెరుగుతుందని, అందుకే సెంటర్లు పెట్టడం లేదని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లంతా క్షేమంగానే ఉంటుండటం, ఈ మధ్య మళ్లీ కేసులు పెరుగుతుండటంతో జనాల్లో వ్యాక్సిన్‌పై ఇంట్రస్ట్ పెరిగింది. కానీ సెంటర్లు అందుబాటులో లేకపోవడంతో ఊర్లలో
జనాలు సైలెంట్‌గా ఉంటున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం వ్యాక్సినేషన్ వివరాలు
స్టేట్ గురువారం మొత్తం
మహారాష్ర్ట 1,36,106 47,56,576
ఉత్తరప్రదేశ్ 1,63,983 43,54,111
రాజస్థాన్ 38,010 43,21,108
బెంగాల్ 88,883 40,13,437
గుజరాత్ 1,20,756 38,71,115
కర్నాటక 58,680 27,97,132
మధ్యప్రదేశ్ 86,160 26,10,164
కేరళ 1,17,759 25,68,679
తమిళనాడు 57,336 21,55,019
ఆంధ్రప్రదేశ్ 89,114 18,51,489
బీహార్ 59,187 18,98,697
ఒడిశా 34,859 16,03,403
చత్తీస్‌గఢ్ 33,325 13,23,217
జార్ఖండ్ 20,982 12,26,042
హర్యానా 33,575 10,52,426
ఢిల్లీ 29,691 9,95,059
తెలంగాణ 27,627 8,58,260
Courtesy V6Velugu