అమానుషమైన కుల వ్యవస్థను నిర్మూలించాలి! సర్దార్ షహీద్ భగత్ సింగ్

0
291

(భగత్ సింగ్ – కులం పై వ్రాసిన రచనలలో దళితులు భారతదేశ విప్లవంలో ముందు  పీఠినగా ఉన్న వారుగా చూశాడు…… రచయిత: హర్షవర్ధన్….)

( సూచన: ఈ వ్యాసం అంతటా భగత్ సింగ్ ,ఆయన రచనలలో ఉపయోగించిన “అంటరానివారు” అనే పదాన్ని అలానే ఉంచాము. అదే ఆ కాలంలో ఉపయోగించబడిన పదంగా ప్రతిబింబిస్తుంది. ఈ వ్యాసంలో ఆయా సందర్భాలలో ఈ మాటను ఆయన ఉపయోగించిన దానిని’ అంటరాని వారిగా పిలువబడిన వారుగా’ చదువుకోవాలి. అదేవిధంగా క్రింది తరగతి అన్న పదాన్ని క్రింది తరగతిగా పిలువబడే దిగాను’ -అగ్రకుల అన్నదానిని అగ్ర కులం గా పిలవబడేదిగాను చదువుకోవాలి.

భగత్ సింగ్ రచనల పైన సోషలిస్టు, మార్క్సిస్టు ఆలోచన యొక్క ప్రభావం గురించి అనేక పత్రములు గా భద్రపరచబడింది. చర్చించబడింది; మరియు బహిరంగంగా చర్చ(debate) చేయబడింది. ఏది ఏమైనప్పటికీ కులము ,అంటరానితనము సమస్యలపైన  ఆయన ఆలోచనలు విశాలమైన విప్లవోద్యమంతో సహా, విద్వత్ సభలు మరియు కార్యకర్తల సమూహాలలో ఎక్కువ శ్రద్ధను చూపలేదు.

ప్రజాదరణ పొందిన ఆయన వ్యాసం- ‘అంటరానితనం యొక్క సమస్య’ కీర్తి పత్రిక 1928 జూన్ సంచిక లో ప్రచురించబడింది. అంతే కాకుండా మరికొన్ని వ్యాసాలు, మరి కొన్ని రచనలలో  భగత్ సింగ్ కులాన్ని, సంబంధిత అంశాలను విమర్శించాడు. ఆయన రచనలు, అన్ని కరపత్రాలు పత్రికా రిపోర్టుల రూపంలో ఉన్నప్పటికీ, అది జరిగిన దానిని వ్యాఖ్యానం గా ఉన్నప్పటికీ కులం మరియు అంటరానితనంపై ఆయన విమర్శలు తెలియజేసే దానిని వాదించే పద్ధతిని వేరు చేయవచ్చును.

కుల ఆధారిత వివక్షను, దాడులను విమర్శించటం ఒక రకం( ఎత్తు) కాగా, రెండవ రకం ది -హిందుత్వం యొక్క మతపరమైన సిద్ధాంతాల నుండి దాని న్యాయయుతము రాబట్ట బడింది. (ఉదాహరణకు వివేకానందుడు, గాంధీ ,సవార్కర్ మొదలగువారు చేసినట్లు) రెండవ తరహా ది. హిందూ మతం యొక్క సూత్రాలు తత్వశాస్త్రముల యొక్క మూలాలను లెక్కలోనికి తీసుకొని చేయవలసి ఉంటుంది . (ఉదాహరణకు- పూలే, అంబేద్కర్ వంటివారు చేసినట్లుగా) కులం మరియు అంటరానితనాన్ని భగత్ సింగ్ చేసిన విమర్శ రెండవ తరహా  దానిలో  ధృఢంగా లంగరు వేసినది.

కులం /అంటరానితనం యొక్క మతపరమైన పునాది.

కులాన్ని మరియు  అంటరానితనం యొక్క ఆచరణ మరియు వానితో పాటు తోడుగా ఉన్న శుభ్రత(purity-శుచి) అశుచి(pollution) లు హిందుత్వం (సనాతన ధర్మం)లో సంపూర్ణ భాగంగా భగత్ సింగ్ అర్థం చేసుకున్నాడు. అంటరానివాడు అంటు కొనటం వల్ల అగ్రవర్ణం, వాని ‘ధర్మం’ అశుచి(pollution) అవుతుంది; నాశనమవుతుంది అనే నమ్మకాన్ని భగత్ సింగ్ అనేక ప్రదేశాలలో విమర్శించాడు. అంటరానివారిని  అంటుకొని నంతలో అగ్రవర్ణ వాడు ‘మైల’ పడిపోతాడా? వంటి ప్రశ్నలతో అంటరానితనం యొక్క సమస్య ప్రారంభం అవుతుంది. దేవాలయాలలోని దేవుళ్ళు అంటరానివారి ప్రవేశంతో కోపగించు కోరా! అదే బావినుండి అంట రాని వారు కూడా నీరును తోడుకు న్నట్లైతే ఆ బావిలోని  త్రాగే నీరు అశుభ్రమై పోదా?

మరో ప్రదేశం లో శుభ్రం -అశుభ్రం ద్విసంఖ్యామాన్ని విమర్శించుతూ’ పండితుని లేక మౌల్వి’ వంటి ప్రజలకు దిగువ కులానికి చెందిన బాలుడు పూలదండ వేస్తే వారు బట్టలు ఉంచుకుని  స్నానం చేస్తారు. మరియు’ జనేయు’ పవిత్ర జంజం నీ అంటరాని వారికి వేయడానికి వారు నిరాకరిస్తారు.

భగత్ సింగ్ ప్రకారం ఈ ఆచరణలు సనాతన ధర్మంచే న్యాయసమ్మతం చేయబడినాయి. ఇది అంటుకొనవచ్చిన వారు అంటరానివారు వివక్షకు, సనాతన ధర్మానికి సానుకూలం. “భగత్ సింగ్ “కులం యొక్క విమర్శలో కేంద్రంగా ఉన్నది” కర్మ” యొక్క బ్రాహ్మణికి సిద్ధాంతం. దీని ప్రకారం ప్రజలకు కులం లేక వర్ణం అనేది వారి పూర్వజన్మలోని యోగ్యత(merit)ను బట్టి నిర్ణయింపబడుతుంది. ‘అంటరానితనం’ యొక్క సమస్య’ అన్నదానిలో భగత్ సింగ్’ కర్మసిద్ధాంతాన్ని’ ఖండించాడు. కుల వ్యవస్థ యొక్క వివక్షతతో వెలువడుతున్న కోపాన్ని అడ్డుకోవటానికి ఈ సైద్ధాంతిక నిర్మాణాన్ని నిర్మించారు. ఆయన ఇలా వ్రాశారు.: చారిత్రికంగా మాట్లాడితే ఈ సమాజం యొక్క ఈ అంతస్థులో (అంటరానివారియెడల) వివక్ష యొక్క ఆ ఆచరణను ఆర్య పూర్వీకులు చేస్తున్నప్పుడు వారిని  నిమ్న కులస్తులుగా అంటగట్టి వారితో మానవ స్పర్శ లేకుండా చేసి, వారికి హీనమైన పనులన్నీ అప్పజెప్పినప్పుడు, వారు కూడా సహజంగా ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు గురించి విచారించటం ప్రారంభించారు; ప్రారంభిస్తారు. (వారు పూర్వ జన్మ తత్వశాస్త్రాన్ని తేలేటట్టు( floated) చేశారు) ఇది అంతా నీవు పూర్వంలో చేసిన పాపాల ఫలితం. దానికి ఏమి చేయగలం. నిశ్శబ్దంగా భరించండి! మరియు అటువంటి నిద్రమాత్రలతో కొంత కాలం వారు శాంతిని కొనగలిగారు.

ఆయన 1930 సంవత్సరంలో వ్రాసిన కరపత్రం లో ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. నేను ఎందుకు నాస్తికుడను? అన్నదానిలో ఆయన ఇలా అన్నారు:” హిందువులారా! ప్రస్తుత  బాధితులు అందరూ గతజన్మలో పాపాలు చేసిన వర్గానికి చెందిన వారని మీరంటారు. మంచిదే ,గత జన్మలో ప్రస్తుత పీడకులు అందరూ సాధువులు;అందుచేత వారు అధికారాన్ని అనుభవిస్తున్నారు; అని మీరంటారు.

మీ పూర్వీకులు అత్యంత వివేకవంతులు. వారు  హేతువు మరియు అపనమ్మకం యొక్క అన్ని చర్యలను  అణకద్రొక్కటానికి సిద్ధాంతాలను కనుగొనడానికి ప్రయత్నించారు అని అంగీకరిస్తాను.

అదే వ్యాసంలో ఆయన వర్ణవ్యవస్థను విమర్శిస్తాడు. వర్ణ వ్యవస్థ ప్రతి వర్ణానికి ఒక కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. నియమాలను అతిక్రమించిన వారికి తీవ్రమైన శిక్షలను విధిస్తుంది కూడాను. అంటరాని వారు వేదాలు గాని ఇతర పవిత్ర గ్రంథాలు(sacred scriptures) విన్నా గానీ వారికి విధించే తీవ్రమైన  శిక్షలను విమర్శిస్తూ భగత్ సింగ్ ఇలా అంటారు: వర్ణ వ్యవస్థతో సంబంధం గల ఈ నియమాలు, చట్టాలు విశేషాధికారం గలవారు హస్తగతం చేసుకున్న అధికారాన్ని, సంపదను,   ఆధిక్యతను, న్యాయ సమ్మతం చేసుకోవటానికి వారు కల్పించినవి, ఇవి అన్నీను అని భగత్  సింగ్ అంటారు.

భగత్ సింగ్ ప్రకారం’ గర్వం, అహంకారం గల బ్రాహ్మణులు” హిందూ సమాజంలో దిగువ స్థాయిలో ఉన్నవారిని కావాలనే విద్య నుండి దూరం చేశారు.; వారు విద్య నేర్చుకోవడమే నేరం గా చేశారు.

కుల వ్యవస్థ యొక్క పరిణామాలు:

భగత్ సింగ్ ప్రకారం  భారత సమాజం పైన కుల సంస్థ(institution) మరియు అంటరానితనం యొక్క ఆచరణ రెండు రుణాత్మక ప్రభావాలు కలిగించాయి. అంటరానితనం యొక్క ఆచరణను ‘మోటు లేక మొరటు’ అయిన క్రూర లక్షణం’ అని అంటరానివారుగా నిర్మించబడిన  వారి  ఆత్మగౌరవాన్ని ఆత్మనిర్భరతను (reliance) తీవ్రంగా లేకుండా చేశాయి. ఇక్కడ కుల ఆధారిత వివక్ష ఫలితంగా మానసిక స్థితికి మరియు మేధస్సుకు జరిగిన నష్టాన్ని గుర్తించాడు.

అంటరానితనం/ కులం యొక్క రెండవ పార్శ్వ    ప్రభావము(side effect) శ్రమ ఎడల ,ప్రత్యేకంగా భౌతిక శ్రమ ఎడల ఏహ్య భావాన్ని కలిగించటం. ఇది ఆయన ప్రకారం, భారత సమాజం యొక్క చారిత్రక ఆర్థిక అభివృద్ధి విలోవ  ప్రభావాన్ని కలిగించింది. ఈ ప్రత్యేక పర్యవసానాన్ని నొక్కి చెబుతూ ఆయన ఇలా వ్రాస్తారు:” విశాలమైన సాంఘిక దృక్కోణంలో అంటరానితనం వినాశకరమైన  (side effect)పార్శ్వ ప్రభావం కలిగి ఉంది. సాధారణంగా ప్రజలు మరో రకంగా జీవనానికి అత్యవసరమైన పనులను ద్వేషించడానికి అలవాటు పడిపోయారు. మనకు బట్టలను అందజేస్తున్న నేత పని వారిని కూడా అంటరానివారుగా చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో ‘నీటిని మోసేవారు’ అంటరానివారిగా చూడబడుతున్నారు. ఇది అంతా శ్రమ యొక్క గౌరవాన్ని ప్రత్యేకంగా మానవ శ్రమను హీన మైనదిగా చేయటంతో మన పురోగతికి తీవ్రమైన నష్టాన్ని చేకూర్చింది.

భగత్ సింగ్ ప్రకారం, అత్యంత హీనంగా చూడబడుతున్న కమ్యూనిటీ వారి నుండి ఉచితంగా, మరియు చౌకగా శ్రమను తీసుకోవటం కుల వ్యవస్థ యొక్కలక్షణం మరియు ఇది  ,ఓవ్యవస్థగా చేస్తున్నది. 1928 సంవత్సరంలో  “జంషెడ్ పూర్” లో శుద్ధి చేసే కార్మికులు చేస్తున్న సమ్మెను పండుగలా(celebrating) జరుపుతూ భగత్ సింగ్ తాను వ్రాసిన వ్యాసం” సత్యాగ్రహం మరియు సమ్మె” లో” పాకీ “వారు సమ్మె చేస్తున్నారు. నగరమంతా చిక్కుల్లో ఉంది. మనకు గరిష్ఠ సేవ చేస్తున్న ఈ సోదరులను మనకు దగ్గరగా రానివ్వము.”భంగిల్!,”భంగిల్!, అంటూ వారిని దూరం పెడతాం. వారి పేదరికాన్ని అవకాశంగా తీసుకొని అత్యంత తక్కువ వేతనాలకు పనిచేసేటట్లు చేస్తాం. మరియు వేతనాలు లేకుండా కూడా పని చేయించుకుంటాం. ప్రత్యేకంగా పట్టణాలలో కొద్ది రోజులలోనే వారిని మోకాళ్ళకు లొంగ కొడతారు. వారు చైతన్యవంతులు కావటం(development) సంతోషకరమైన పరిణామం.

భారత సమాజ పురోగతిలో చారిత్రకంగా అంటరాని వారు చేసిన మంచిపనిపై ఆయన వ్యాఖ్యానిస్తూ వారిని” జీవితాన్ని నిలిపిన నిజమైన వారు.,…. నిజమైన కార్మిక వర్గం., జాతుల యొక్క స్తంభాలు.  మరియు దాని యొక్క కేంద్ర శక్తి అని వారిని ఆయన అన్నారు.

అగ్రవర్ణాల నాయకత్వాన  సాగిన సామాజిక సంస్కరణ ఉద్యమాలు పై విమర్శ!

కులం మరియు అంటరానితనం యొక్క భయానకమైన వైనానికి వ్యతిరేకంగా  పోరాడే వివిధ సంస్కరణల ఉద్యమాల గురించి భగత్ సింగ్ అత్యంత సందేహంతో ఉండేవాడు. అతని ప్రకారం అగ్రవర్ణ నాయకత్వాన గల సామాజిక సంస్కరణ ఉద్యమాలు అంటరానివారి ఎడల నిజమైన విచారం (concern) తో వచ్చినవి కావు. 1909  “మింటో మార్లే “సంస్కరణలు ప్రతిపాదించిన విడి విడి గాఎలక్ట్రోలేట్ లు, మత ప్రాతిపదికన ప్రవేశ పెట్టిన దానికి ప్రతిచర్యగా ఆ సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. “కమ్యూనల్ అవార్డు “గా పిలువబడిన ఆ ప్రతిపాదన ముస్లిములు, సిక్కులుతో పోల్చితే అగ్రకుల హిందువుల ప్రబలమైన స్థానాన్ని దెబ్బతీసే ది అయ్యింది. ఆ ప్రతి ప్రకారం చట్టసభ(legislature) లో ఆ మతాలవారి జనాభాను బట్టి సీట్లు నిర్ణయించబడతాయి.

సామాజిక జీవితంలో సమానత్వాన్ని కలిగిస్తామని వాగ్దానంతో ముస్లిం,  క్రైస్తవ  ,సిక్కు, మత ప్రచారకులు అంటరానివారిని తమ వైపు తీసుకుపోవటానికి ప్రయత్నించడంతో- గతంలో అంటరానివారు హిందూమతంలో భాగమే కాదనే, అగ్రకుల హిందువులకు ఎన్నికల రంగంలో అంకెల ఆటలో తాము ఓడిపోతామనే భయం కలిగింది. భగత్ సింగ్ ప్రకారం ఈ జడిపింపు(  దడిపింపు)  ఆ విషయంలో హిందువులను వారి సాచివేత నుండి(complacency) కుదిపి వేసింది.” తాము భయానికి, అంటరానితనాన్ని తొలగించటానికి ప్రయత్నిస్తున్నామని,తమను తాము సంస్కరణవాదులు గా చెప్పుకునే కొంతమంది తో పాటు, “సాంప్రదాయక బ్రాహ్మణులు (కూడా) ఈ విషయం గురించి ఆలోచించడం ప్రారంభించారు.”

ఈ అగ్రకుల సంస్కరణవాదుల నాయకత్వాన సాగిన ఈ సంస్కరణ ఉద్యమాలు నిజమైనవి కావు. అవి కపటమైనవి. తన వాదనలు నిరూపించుకోవటానికి పాట్నాలో జరిగిన ఒక సంఘటనను  ఉదహరించాడు. అక్కడ సామాజిక సంస్కరణ వాదుల అంటరానితనం యొక్క సమస్యను చర్చించటానికి గుమిగూడారు. అంటరానివారు “పవిత్ర దారమూ “(thread–  జంజము) ను వేసుకొనుటకు,  వేదములు చదవటానికి వారికి అర్హత గురించి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు సామాజిక సంస్కరణ వాదులలో కొందరు తమ  సంయమనమును  కోల్పోయారు. అర్హతను కల్పించటానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలిపారు.

అంటరానితనాన్ని తొలగించటానికి ప్రచారాన్ని(క్యాంపేయిన్ లను) ప్రారంభించిన మదన్ మోహన్ మాలవ్యా ను విమర్శిస్తూ భగత్ సింగ్ ఇలా వ్రాశారు. పండిట్ మాలవ్యా వంటి ప్రముఖ సంఘ సంస్కర్త, అంట రానివారియెడల సానుభూతి ఉన్నవాడిగా ప్రచారం గల అయన– బహిరంగంగా పారిశుద్ధ కార్మికులచే పూల దండ వేయించు కోవటానికి అంగీకరించి, అలా వేసిన తరువాత తాను మలిన పడినట్లుగా భావించి ఇంటికి వెళ్లి స్నానం చేశాడు. బట్టలను ఉతికిం చుకున్నాడు. ఎంత పరిహాసము……..?

అదేవిధంగా “మతము మరియు మన స్వతంత్ర పోరాటం” అన్న శీర్షిక గల మరొక వ్యాసములో— ఇది1928 సంవత్సరంలో ‘మే ‘నెల లో:” కీర్తి” సంచికలో ప్రచురించబడింది.—  ఈ(అంటరానితనం) చెడులను సంస్కరించాలని ప్రజల కూడా చెప్తారు. మంచిదే! స్వామి దయానంద అంటరాని తనాన్ని నిర్మూలించాడు. కానీ ఆయన నాలుగు వర్ణాలకు  మించి పోలేక పోయాడు. వివక్ష ఇప్పటికీ అట్లానే ఉంది.”

భగత్ సింగ్ అంటరానితనం యొక్క ఆచరణను వ్యతిరేకించటం మాత్రమే కాదు చేసింది. ఆయన మొత్తం కులవ్యవస్థను కు వ్యతిరేకం. ఇది స్వామి దయానంద ను పైన ఖండించటం లో స్పష్టంగా కనబడుతుంది. అదే వ్యాసంలో ఈ సమస్యను లేకుండా చేయాలంటే–‘—-  అంటుకొనుట-  అంటరాని వివక్షకు అనుకూలమైన సనాతన ధర్మము ను వ్యతిరేకించాలి “అని ఆయన అంటారు.

వేరుగా ఎలక్ట్రో రేటును ఏర్పాటు చేయాలని వాదించుట!

అంటరాని వారికి వేరుగా ఎన్నికల  సముదాయం( ఎలక్ట్రోరేట్ ను) ఏర్పాటు చేయాలనే ప్రశ్నను మంచి ఉద్దేశంతో దాని వద్దకు చేరాడు. ఆయన ప్రకారం ప్రతిపాదిత కమ్యూనల్ అవార్డు : (అ)అంటరాని వారిని ఒక రాజకీయ గ్రూపుగా బలసంపన్నం చేయడానికి, (ఆ) కుల నిర్మాణాన్ని బలహీనపరచడానికి ఇది సహాయ పడుతుంది.— ఆ దిశగా  ఇది ఒక మెట్టు వంటిది.  ఆయన ఇలా వ్రాశారు.:” జాతీయ విముక్తి దిశగా, మనం పురోగమిస్తున్న సందర్భంలో మరో ఏ విధంగానూ కమ్యూనల్ ప్రాతినిధ్యం సమస్యకు లాభదాయకంగా ఉంటది? ,కానీ కనీసం దాని అర్థం హిందువులు, ముస్లిములు ,సిక్కులు తమ సంబంధిత వైపుకు  అంటరానివారిని గరిష్ఠ స్థాయిలో ఆకర్షించి, తమ సీట్ల కోటాను గరిష్టం చేసుకొనటానికి గట్టి కృషి చేస్తున్నారు. ఆ ముగ్గురు ఒకరిపై మరి ఒకరు పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నారు. దీని ఫలితంగా కల్లోల పరిస్థితులు విస్తారంగా ఏర్పడుతున్నాయి. ఈ గడబిడ వలన అంటరానితనం యొక్క పట్టు బలహీనపడే దిశగా మనకు సహాయపడుతుంది.

అంటరానివారు ఒక ప్రత్యేక గుర్తింపు గల వారిగా సమీకృతం కావడం యెడల భగత్ సింగ్ పూర్తి అనుకూలతలో కూడా ఉన్నాడు. ఆయన ఇలా వ్రాశారు: అంతిమంగా అంటరానివారు “కమ్యూనిటీలు” వాటంత  అవి ఐక్యం కానంతవరకు, ఆర్గనైజ్ కానంతవరకు ,ఆ సమస్య సంతృప్తికరంగా పరిష్కారం కాదు………… తమ ప్రత్యక  గుర్తింపు ఆధారంగా ఈ మధ్యకాలంలో ఐక్యం కావడం… పైన దిశగా తీసుకున్న చర్యగా, మేము భావిస్తాము…….. చట్టసభలలో తమ జనాభా సంఖ్య అనుసరించి అనులోమానుపాతంలో తమ ప్రాతినిధ్యం ఉండాలని, ఆ దిశగా వారు ముందుకు సాగిపోవాలని మేము వాది స్తాం….. మీ శ్రమ లేకుండా మీరు ముందుకు పోలేరు”.

చట్ట సభల పరిధిలోనే కులం లేదా అంటరానితనం  పరిష్కరించబడదని భగత్ సింగ్ అభిప్రాయాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఆయన ప్రస్తుతం తో సంబంధం గల ఆచరణాత్మక ప్రశ్నను అడిగాడు.: చిన్నపిల్లల వివాహాలు జరగకుండా చేయాలని బిల్లు పైన అది తమ మతాన్ని దెబ్బతీస్తుందని చట్టసభలలో పెద్ద రగడ లేవదీయగా, తమ స్థాయికి అంటరానివారిని తీసుకురాగల బిల్లును తీసుకు వచ్చే ధైర్యం వారు చేయగలరా.,,….!!

ఆయన దృష్టిలో విశేషాధికారం గల అగ్రవర్ణానికి చెందిన కులస్తులు తమకంటే అడుగున ఉన్న వారిని పీడిస్తూనే ఉండటానికి తమకు సాధ్యమైనంతగా ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు.  అందుచేత ఆయన దృష్టిలో అధికారిక చట్టసభల నాయకత్వాన క్రమ పద్ధతి కానీ సంస్కరణ గాని ఉపయోగం లేదు. బయటకు పోయే మార్గం””” సామాజిక ఆందోళన… నుండి.. రాజకీయ ఆర్థిక విప్లవం కొరకు తీసుకువెళ్లే ఉత్సవాన్ని ప్రారంభించడమే!

కులాన్ని ,అంటరానితనానికి వ్యతిరేకంగా ఆచరణలో పోరాడటం!

భగత్ సింగ్ ఉరి తీయబడడానికి పూర్వం ఆయన బబి” చేత వండిన” రోటీని” కోరుకున్నాడని అందరికీ తెలిసిన విషయమే!. జైలులో దళిత ఖైదీ” బోగా”ను అందరూ బిబి (అమ్మ) అని సంబోధిస్తారు. ఇది ఒక చిహ్నమయిన చర్య మాత్రమే కాదు. అది భగత్ సింగ్ రాజకీయాల యొక్క విశాలమైన ఉద్దేశములో భాగం అయ్యింది. 1926 సంవత్సరములో భగత్ సింగ్ ఆయన కామ్రేడ్లు కలిసి ఏర్పాటు చేసిన “నవ జవాన్ భారత్ సభ “సామాజిక భోజనాలను ఆర్గనైజ్ చేస్తూ ఉండేవారు. ఆ భోజనాలకు అన్ని కులాల వారిని, మతాల వారిని రమ్మని ఆహ్వానించేవారు. అక్కడ ప్రతి ఒక్కరూ మరొకరికి వడ్డన చేసేవారు. ఆ విధంగా శుభ్రత ,శుచి,మలినం భావనలను ఎదుర్కొనేవారు.

గతంలో అగ్ర కులస్తులు గా పిలువబడే వారు అంటరాని వారికి చేసిన కష్టనష్టాలకు, సముదాయంగా క్షమాపణ చెప్పాలని ఆయన భావన. అంటరానివారిని సమాన మానవులుగా చూడటానికి శుద్ధి కార్యక్రమాలు లేదా ఆచార కర్మకాండ చేయనవసరం లేదని కూడా ఆయన  నమ్మాడు. అంటరానితనం యొక్క సమస్య” అన్న దానిలో ఆయన ఇలా వ్రాసాడు.:  ప్రాయ శ్చిత్తమునకు ఇది సమయం…… ఈ విషయంలో “నవ జవాన్ భారత్ సభ “మరియు యువకుల కాన్ఫరెన్స్ సొంతం చేసుకున్న వ్యూహం చాలా సరైనది….. అంటరాని వారిగా ఎవరినైతే మన పిలుస్తున్నామో… ఆ సహోదరులను క్షమించమని అడగటం,సహోదర మానవులుగా వారి ఎడల వ్యవహరించటం, సిక్కు, ఇస్లాం లేదా హిందుత్వంలోకి మారినప్పుడు చేసే ఉత్సవాలు చేయనవసరం లేకుండా, వారి చేతుల నుండి ఆహారాన్ని మంచినీళ్ళను స్వీకరించటం ద్వారా ఇది జరగవలసి ఉన్నది.

” మతము మరియు మన స్వాతంత్ర్య పోరాటం” అన్న ఆయన వ్రాసిన వ్యాసం లో మన స్వేచ్ఛ అంటే అర్థం ఇంగ్లీషు వారి పిడికిలి నుండి విముక్తి సాధించడం మాత్రమే కాదు, పూర్తి స్వాతంత్ర్యం కూడా నూ.. అక్కడ ప్రజలందరూ మానసిక బానిసత్వం నుండి విముక్తి అయ్యి, తగవులు లేకుండా ఒకరితో  మరొకరు స్నేహంగా జీవించటం అని అర్థం. “మానసిక బానిసత్వం” అన్న పదం సమాజంలో మతం యొక్క పట్టుకు సంబంధించినది. దానితో పాటుగా సమాజంలో అంటరానితనం యొక్క ఆచరణ ” అల్పబుద్ధిత్వాన్ని విడిచిపెట్టటం, పక్ష బుద్ధి గల ఆహార అలవాట్లను మార్చటం, అంటుకొనుట అంటరాని అనే పదాలను వేళ్ళ తో సహా పెకలించి వేయటం ద్వారా” బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సహకరించుకోవడం, ఐక్యం కావటం సాధ్యం ‘అని ఆయన రాశారు.

1928 సంవత్సరములో ఢిల్లీలోని  “ఫిరోజ్ షాకోట” వద్ద జరిగిన సమావేశంలో “హిందుస్థాన్  రిపబ్లికన్ అసోసియేషన్(HRA) “-అన్న పేరును -హిందుస్థాన్” సోషలిస్ట్” రిపబ్లికన్ అసోసియేషన్(HSRA) గా మార్చారు. సోషలిజం తమ అధికారిక సిద్ధాంతముగానూ మరియు లక్ష్యంగానూ ప్రకటించుకున్నారు(ఎడాప్ట్ చేసుకున్నారు). కులానికి, మతానికి సంబంధించి మరొక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. —“””విప్లవకారులు మతానికి, కులానికి సంబంధించిన అన్ని చిహ్నాలను విడిచిపెట్టాలని నిర్ణయించబడింది.””:”””—(- ఈ మాటలను  వొత్తి చెప్పటం జరిగింది). మరల, మతానికి కులానికి సంబంధించిన అన్ని చిహ్నాలను విడిచిపెట్టాలని తీసుకున్న ఈ నిర్ణయం ఏదో అకస్మాత్తుగా అప్పటికప్పుడు భగత్ సింగ్ అతని సమకాలీన విప్లవకారులు తీసుకున్న నిర్ణయం కాదు.

ఈ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొనుటకు పూర్వం హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ కు చెందిన విప్లవకారులు రాజేంద్రనాథ్ లహరి, మన్మద్ నాథ్ గుప్తా, కేశవ చక్రవర్తి, మరియు ఇతరవిప్లవకారులు, కాకోరి కుట్ర కేసులో శిక్ష పడిన వారు, తమ పవిత్ర  దారాన్ని(జంజాన్ని)  తీసివేశారు. అంకుర్ గోస్వామి తో కలిసి నేను దీన్ని కన్న ముందు వ్రాసినట్లు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA) విప్లవకారులు  బ్రాహ్మణిక , సాంఘిక మతపరమైన సాంప్రదాయాలను భగ్నం చేసే వారు అనేది గుప్తా గారు తన స్వీయచరిత్ర అయిన “వారు ప్రమాదకరంగా జీవించారు” అన్నదానిలో చెప్పినదానితో దృఢపరుస్తుంది. గుప్తా గారు ఇలా వ్రాశారు.: మొత్తం సమాజాన్ని కాదని మేము ‘ఆవు మాంసాన్ని తినే వారము” అంటే- దీని అర్థం సభ్యులు అందరూ ఈ దృష్టితోనే ఉన్నారని కాదు. “ముసలి” సభ్యులు ఆవు మాంసం తినటాన్ని సమర్ధించకపోయినా ,మాజీవనం యొక్క ప్రతి అంశంలోనూ విప్లవ ఆదర్శాలను ప్రయోగం చేస్తున్న “యువ” సభ్యులపై తమ నమ్మకాలను రుద్దేవారు కాదు. గుప్తా ననుసరించి, వయసు పై బడిన సభ్యులు  యువ విప్లవ కారులకు అది వద్దు, ఇది వద్దు అంటూ చెప్పటానికి ప్రయత్నించేవారు. మతపరమైన సంకేతాలను( కోడ్లను) చెప్పటం ద్వారా కాకుండా డిబేట్ చర్చల ద్వారా మాంసాహారం భోజనానికి బదులుగా శాకాహార భోజనం వల్ల కలిగే మేలును గూర్చి చెప్పటానికి ప్రయత్నించేవారు.

కులం మరియు అంటరానితనాన్ని భగత్ సింగ్ విమర్శించటం , వర్గ లేదా ఆర్థిక పునాది గల విమర్శ లేదా సమానత్వ యొక్క సాధారణ ఆలోచన (idea). ఆధారంగా చేసిన విమర్శ మాత్రమే కాదు. కులము మరియు అంటరానితనం యొక్క పునాది పై నే ఆయన దాడి చేశారు. బ్రాహ్మణిక మతపరమైన గ్రంథాలు లో పొందుపరిచిన కుల వ్యవస్థ యొక్క తాత్విక, మతపరమైన, ఆత్మ సంబంధ తర్కము పై దాడి చేయటం చేశారు.

ఆనాడు ఉన్న ఆర్థిక అసమానతలను సమర్ధించడానికి, న్యాయ సమ్మతము చేయటానికి, పని చేయు సైద్ధాంతికంగా వ్యవస్థగా కూడా కులాన్ని భగత్ సింగ్ అర్థం చేసుకున్నాడు. ఇది మతం యొక్క ఆయన విమర్శ కు కొనసాగింపు. ఆయన ప్రకారం మతం అనేది తమకు ఇష్టమైన రీతిలో  త్రిప్పెడు సాధనం. కులం మరియు మతం గురించి ఆయన అభిప్రాయాలు సైద్ధాంతిక చర్యకు సంబంధించి స్పష్టంగా మార్క్సిస్టు చట్రం నుండి  ప్రోత్సాహం  పొందినవి. ఆయన తనను  కులం యొక్క ఆర్థిక అవగాహన వరకే పరిమితం చేసుకోనలేదు. ఆయన దాని యొక్క సాంస్కృతిక, మానసిక ప్రభావాన్ని కూడా గుర్తించాడు.

భగత్ సింగ్ కులాన్ని సమగ్ర పద్ధతులో అర్థం చేసుకున్నాడు. దానికి పరిష్కారం కూడా సమగ్ర స్వభావం కలిగి ఉంది. కులం పైన వ్యాఖ్యానించిన ప్పుడు ఆయన సాంస్కృతిక, ఆర్థిక, లేదా రాజకీయ సాంస్కృతిక లేదా ఆర్థిక రాజకీయ ద్వైవలను  ఆయన సృష్టించలేదు. కులం ఒకే సమయంలో సాంఘిక ,సాంస్కృతిక ,ఆర్థిక, రాజకీయ సమస్య. దానితో పని చేయుటకు ఒకే ఒక మార్గం- వేరువేరుగా కనబడిన పైన పేర్కొన్న రంగాలన్నిటిని ఒకటిగా తీసుకొనడం ద్వారానే పని చేయగలం.

అంటరానితనం పైన ఆయన వ్యాసం చివరిలో వలె భగత్ సింగ్ అంటరానివారిని ప్రోత్సహిస్తూ ఆయన ఇలా అన్నాడు. కమ్యూనిస్టు ప్రణాళిక నుండి ప్రఖ్యాత మాట” కార్మికులందరూ ఐక్యంగా కావాలి మీకు పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప” అని చెప్పటం తోబాటు తిరుగుబాటు జెండాను ఎగుర వేయండి” మరియు సమాజం యొక్క ప్రస్తుత క్రమాన్ని సవాలు చేయండి.కానీ ,ఆయన దానికి ముఖ్యమైన దాన్ని   అదనంగా చేర్చాడు.” మీరే నిజమైన కార్మికవర్గం” అంటరానివారు అగ్రమముగా కార్మిక  వర్గ విప్లవం మాత్రమే భారతదేశాన్ని పెట్టుబడిదారీ, మరియు కుల దోపిడి నుండి విముక్తి చేయగలదు’ అని ఆయన యొక్క దృఢ అభిప్రాయం.

(తెలుగు అనువాదం: కొల్లిపర వెంకటేశ్వరరావు, కేంద్ర కమిటీ సభ్యులు,  సిపిఐ( ఎమ్.ఎల్)  రెడ్ స్టార్.

Leave a Reply