రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు

0
217
రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు

గుంటూరు: తెదేపా నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీలో రాయపాటి భాగస్వామిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఇండియన్‌ బ్యాంకు నుంచి రూ.500 కోట్లు రుణం తీసుకుంది. సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఇండియన్‌ బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు విచారణలో భాగంగా ఈరోజు ఉదయం ట్రాన్స్‌ట్రాయ్‌ కార్యాలయాలతో పాటు గుంటూరులోని రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో రాయపాటి ఇంట్లో లేరని తెలుస్తోంది.

(Courtesy Eenadu)

Leave a Reply