ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఉద్యోగ దందా బాధితుల్లో మరొకరి ఆత్మహతాయత్నం

0
26
  • పురుగు మందు తాగిన పెద్దపల్లి జిలా యువకుడు
  • విషమంగా పరిస్థితి.. కరీంనగర్‌ ఆస్పత్రికి తరలింపు
  • కొలువు కోసం టీఆర్‌ఎస్‌ నాయకుడికి రూ.7 లక్షలు

పెద్దపల్లి, పాలకుర్తి : రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌)లో కాంట్రాక్టు ఉద్యోగం కోసం డబ్బులు చెల్లించి మోసపోయానంటూ మరో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ముంజంపల్లి గంగుల శేఖర్‌ (24) సోమవారం రాత్రి పురుగు మందు తాగాడు. అతడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శేఖర్‌ను.. ఆర్‌ఎ్‌ఫసీఎల్‌లో శాశ్వత ఉద్యోగమని, నెలకు 30వేల నుంచి 50 వేల వరకు సంపాదించుకోవచ్చని, వారసత్వంగా ఉద్యోగం ఉంటుందని అంతర్గాం మండలం మొర్మూర్‌ గ్రామానికి చెందిన అర్కల తిరుపతి నమ్మించాడు. దీంతో సంవత్సరన్నర క్రితం అప్పు చేసి వరుసకు సోదరుడైన యాగండ్ల రాజు ద్వారా అర్కల తిరుపతి, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు బొమ్మగాని తిరుపతిగౌడ్‌లకు రూ.7 లక్షలు ఇచ్చాడు. అయితే, ఆరు నెలలు ఫ్యాక్టరీలో పనిచేసిన తర్వాత కొత్త కాంట్రాక్టు సంస్థ రావడం, జీతం సరిగా ఇవ్వకపోడంతో మానేశాడు. డబ్బు తిరిగివ్వాలని మధ్యవర్తులను అడగడంతో బెదిరింపులకు దిగారు. దీంతో శేఖర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి అడుగుతుండడంతో సోమవారం రాత్రి 11 గంటలకు పురుగుమందు తాగాడు. విషయాన్ని తండ్రి రాజయ్యకు చెప్పడంతో శేఖర్‌ను ధర్మారం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. కాగా, తాము కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని న్యాయం చేయాలని బాధితుడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Leave a Reply