కట్టేసి కొట్టారు.. పేడ తినిపించారు..

0
39

పిల్లలు మామిడికాయల దొంగతనానికి వచ్చారని కాపలాదారుల క్రూరత్వం

తొర్రూరు టౌన్‌ : అభం శుభం తెలియని పిల్లలపై కర్కశత్వంగా వ్యవహరించారు ఇద్దరు వ్యక్తులు.. మానవత్వానికే మచ్చ తెచ్చిన ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. తొర్రూరుకు చెందిన ఇద్దరు పిల్లలు తాము పెంచుకునే కుక్క కనిపించడంలేదని పట్టణ శివారులోని మామిడితోటకు వెళ్లగా.. మామిడికాయలు దొంగిలించడానికి వచ్చారని భావించిన కాపలాదారులు వారిని పట్టుకొని పశువుల్ని కట్టినట్లుగా తాడుతో కట్టేసి చితకబాది, పేడ తినిపించారు. ఈ దృశ్యాలు గురువారం సాయంత్రం సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయ్యాయి. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు తొర్రూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు కలెక్టరు, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పిల్లలను హింసించిన బొత్తల తండాకు చెందిన బానోత్‌ యాకు, హచ్చుతండాకు చెందిన బానోతు రాములును అదుపులోకి తీసుకొని, వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై నగేష్‌ తెలిపారు.

Courtesy Eenadu

Leave a Reply