ఒక దేశం 56 సంస్కృతీ స‌మూహాలు

0
546

వేలాది సంవత్సరాల నుంచీ సాంస్కృ తిక సంలీనాల కారణంగా ఇప్పుడు చైనాలో 56 విభిన్న సంస్కృతీ సమూహాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఆ ప్రభుత్వం అధికారికంగా గుర్తించినవి కావడం గమనార్హం.
పురాతనకాలం నుంచీ చైనీయుల సంస్కృతి మీద కన్‌ఫ్యూషియనిజం, సంప్రదాయవాద సిద్ధాంతాల ప్రభావం ఉంది. రాజవంశపాలనలో హాన్‌ రాజవంశ ఆధారిత పాలకులు సాంఘికాభివృద్ధి కోసం కొంత కృషి చేశారు. చైనీయుల సాహిత్యం చైనా సంస్కృతిలో చైనా దస్తూరీ, సంప్రదాయ కవిత్వం, చిత్రలేఖనం మొదలైన కళారూపాలు చైనా నాటకం, నృత్యాల కంటే ఉత్తమమైనవిగా ప్రశంసలందుకున్నాయి. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ఆరంభకాల నాయకులు సంప్రదాయ రాజకుటుంబ వారసత్వానికి చెందినవారు. అయినా సరే మే ఫోర్త్‌ ఉద్యమం స్ఫూర్తి, సంస్కరణా సంకల్ప ప్రభావం వారి మీద ఉండేది.
సాంస్కృతిక విప్లవం ముందు- తర్వాత
1949లో స్థాపితమైన పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా రాజరికచరిత్ర సంబంధితమైనదే. అయినప్పటికీ కమ్యూనిస్ట్‌ పార్టీ చైనా సంప్రదాయాలను సమూలంగా మార్చడానికి కృషి చేసింది.. 1960లో తలెత్తిన సాంస్క ృతిక విప్లవం కూడా అందులో ఒకటి. కమ్యూనిజం భూస్వామ్య విధాన అవశేషాలను తొలగించే ప్రయత్నం చేసింది. చైనా సంప్రదాయక నీతి, కన్‌ఫ్యూషియనిజం సంస్క ృతి, కళలు, సాహిత్యం, పెకింగ్‌ ఒపేరా వంటి కళాప్రదర్శనలు కలగలిసిన చైనా సంస్క ృతిని ప్రభుత్వ విధానాలు కదిలించాయి. చైనా సంస్కృతిలో గుర్తించతగిన మార్పులు సంభవించాయి. కాలక్రమేణా చైనా ప్రభుత్వం సంస్కృతికి చెందిన పలు విధానాలకు అనుమతి ఇవ్వడంతో చైనా కళలు, సాహిత్యం, సంగీతం, చలనచిత్రాలు, ఫ్యాషన్‌, నిర్మాణకళకు పటిష్టమైన పునరుజ్జీవనం లభించింది. అలాగే చైనా జానపద కళలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

అత్యధికులు హాన్‌ ప్రజలే
చైనాలోని సాంస్కృతిక సమాజాలను పరిశీలిస్తే దేశంలో అత్యధిక జనాభా హాన్‌ సంస్కృతికి చెందినవారే. దేశం మొత్తం జనాభాలో వీరు 91.59 శాతం మంది ఉన్నారు. వీరు దేశం నలుమూలలకీ విస్తరించి ఉన్నారు. మధ్యచైనా ప్రాంతంలోనూ, ఎల్లో రివర్‌, యాంగ్టిజ్‌ నది, పెరల్‌ రివర్‌, మైదాన ప్రాంతాల్లోనూ నివసిస్తున్నారు. వీరు చైనాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక సమూహంగా గుర్తింపు పొందారు. వీరు తమ సాంప్రదాయాలకు అనుగుణంగా జీవనం సాగిస్తున్నారు.

55 మైనారిటీ సాంస్కృతిక సమూహాలు
చైనాలో హాన్‌ కాకుండా మిగిలిన 55 సాంస్కృతిక సమూహాలు అల్పసంఖ్యాకమైనవి. మొత్తం జనాభాలో వీరందరు కనీసం తొమ్మిది శాతం కూడా లేరు. అయినప్పటికీ చైనా ప్రభుత్వం వీరి అస్తిత్వాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సాంస్కృ తిక సమూహాలకు రకరకాల రూపాల్లో అవరోధాలు, ఆంక్షలూ ఎదురవుతున్నాయి. ఈ సమూహాలు దేశంలోని నైరుతి, వాయువ్యం, ఈశాన్య ప్రాంతాల్లోనే కాకుండా మంగోలియా, క్షింజియాంగ్‌, నింగ్జియా, గుంగ్షీ, క్వింగై, యునాన్‌, సిచౌన్‌, గన్సు, హుబై, హునాన్‌, తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ సమూహాల్లో యునాన్‌ ప్రాంతంలో ఉన్న జుయాంగ్‌ 16 మిలియన్లకు పైగా జనాభా ఉన్న సమూహం. తక్కినవన్నీ ఇంకా చిన్నవి.

సుహృద్భావనల కోసం కృషి
విభిన్న సాంస్కృతిక సమూహాల మధ్య సుహృద్భావనలను పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రాంతీయ స్వయంప్రతిపత్తి, సమానత్వ హక్కుని, ఐక్యతని కాపాడడం, వారి విశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవించేలా చర్యలు తీసుకోవడం లాంటివి ఇందులో కీలకమైనవి. దీనికోసం ఐదు స్వయం ప్రతిపత్తి ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అవి ఇన్నర్‌ మంగోలియా, క్షింజియాంగ్‌, గునాగ్షి, నింగ్జియా, టిబెట్‌. ఈ ప్రదేశాల్లో ఆయా సాంస్కృతిక సమూహాలకు ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఈ ప్రాంతాల్లోని వీరంతా హాన్‌ ప్రజలతో కలిసి చైనాలోని బలమైన సాంస్కృతిక వారసత్వాన్ని ముందుతరాలకు అందించడానికి సంయుక్త కృషి చేస్తున్నారు.

  – సంగమం డెస్క్‌

Leave a Reply