సిటిజన్ బిల్లు రాజ్యాంగ విరుద్దం

0
91

భారత కమ్యూనిస్టు విప్లవ కారులసమైక్యతకేంద్రం(మా-లె) UCCRI-(ML)కిషన్,వర్గం

కేంద్రంలోని BJP మోడి-2, ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(కాబ్), జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు పూర్తిగా వ్యతిరేకమైనదవిగా, ఆధునిక సమాజనియమాలకు, సహజన్యాయ సూత్రాలకు విఘాతమైనవిగా బావిస్తు, వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము.

ఈ చట్టాలను నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రాలైన నాగా, మిజోరాం తదితర 5 రాష్ట్రాల మైనారిటీ ప్రజలుభారత రాజ్యాంగ పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమాలకు, ఆందోళనకు మామద్దతును తెలుపుతున్నాం. మతాతీతంగా జీవనవిధానాన్ని సాగిస్తున్న దేశంలో మతాలుగా పౌరసత్వ నిర్ధారణ చేసుకునే విషాద స్థితి కల్పించాలనుకోవడం అప్రజాస్వామికమైనది. శరణార్ధులై, పీడనకు గురై నిలువనీడ కోసం వస్తున్న ప్రజలను మతాలవారీగా కొందరిని ఆహ్వానించడం, మరికొందరిని అడ్డుకోవడం హేయమైంది. CAB-NRCలతో ప్రపంచం ముందు భారత సమాజం తలవంచుకునేలా కేంద్ర ప్రభుత్వం చేస్తుండటాన్ని క్షమించలేని చర్యగా బావిస్తు, వాటిని వ్యతిరేకిస్తున్న ఈశాన్య ప్రజలపై, జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై జరిపిన హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

జి.సదానందం,
రాష్ట్ర కార్యదర్శి
సెల్:9494970334.

Leave a Reply