దిగిరానున్న వంటనూనెల ధరలు

0
25

లీటరుపై రూ.10-12 వరకూ తగ్గే చాన్స్‌ 

న్యూఢిల్లీ : ధరల పెరుగుదలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సామాన్య ప్రజలకు స్వల్ప ఊరట లభించనుంది. త్వరలో వంటనూనెల ధరలు లీటరుపై రూ.10 నుంచి రూ.12 వరకూ తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు తయారీ సంస్థలు అంగీకరించాయి. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారులతో గురువారం జరిగిన సమావేశం అనంతరం వంటనూనెల తయారీ సంస్థల ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

కాగా, అదానీ విల్మర్‌ కంపెనీ ఇటీవల వంటనూనెల ధరలపై లీటరుకు రూ.30 వరకూ తగ్గించింది. ఫార్చూన్‌ బ్రాండ్‌తో తన ఉత్పత్తులను విక్రయించే ఈ కంపెనీ సోయా నూనెల ధరలను ఎక్కువగా తగ్గించింది. అయితే తాజాగా అంతర్జాతీయ ధరల్లో మరింత తగ్గుదల కారణంగా మరోసారి రేట్లు సవరించడంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కోరడంతో తయారీదారులు సానుకూలంగా స్పందించారు.

Leave a Reply