అత్మస్తైర్యంతోనే కోరోనాను జయించిన: హీరో విశాల్‌

0
227

తను ఎలాంటి ఆయుర్వేదిక్‌, హోమియోపతి లాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు. మా నాన్న, మా మేనేజర్ కోరోనాను ఎలా జయించారో చెప్పాలన్నదే తన కోరిక అని ప్రముఖ హీరో విశాల్‌ వ్యక్తం చేశారు. విశాల్ వారి తండ్రి జికె రెడ్డి కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ సందర్భంగా విశాల్ ఒక వీడియో విడుదల చేశారు..

ఆ విడియోలో తను మాట్లాడుతూ… మా నాన్నకు 82 సంవత్సరాలు. ఈ వయసులో ఆయనను హాస్పటల్లో అడ్మిట్ చేయాలనే ఆలోచన అస్సలు లేదు. ఇంట్లోనే ఉంచి ఆయనను బాగా చూసుకోవాలనేదే నా కోరిక. కాబట్టి నేనే దగ్గరుండి ఆయనను చూసుకున్నాను. ఆ క్రమంలో నాకు అవే లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకుంటే నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో పాటు నాకు దగ్గరగా ఉండే మా మేనేజర్ కి కూడా పాజిటీవ్ వచ్చిందని ఆ విడియోలో పేర్కొన్నారు. మా అంకుల్‌ డాక్టర్ హరిశంకర్ సమక్షంలో మేము ఆయుర్వేదిక్‌, హోమియోపతి మెడిసిన్ తీసుకున్నాము. ఈ కోవిడ్ సమయంలో భయపడకూడదు దాన్ని గుండె దైర్యతో ఎదుర్కోవాలి. ఒక వేల బయపడితే ఆ భయం చాలా అనర్ధాలకు దారి తీస్తుంది. కోరనా మా నాన్న నుండి నాకు నాన్ నుండి మా మేనేజర్ కి కూడా వచ్చింది. కాని మా దైర్యమే మమ్మల్ని మూడు వారాల్లో పూర్తిగా కోలుకునేలా చేసింది. డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు మందులు కూడా మాకు బాగా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా 82 సంవత్సరాలున్న మా నాన్నకు చాలా ఉపయోగపడింది . ఈ సందర్భంగా మా అంకుల్ డాక్టర్ హరి శంకర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను.

మన జీవితంలో ఎన్నోఅనుభవాలు చూస్తాం. ఇదీ ఒక గొప్ప అనుభవమే. ఒక సినిమా ప్రారంభంలో సామాజిక స్పృహతో ఎన్నో వీడియోలు చేస్తాం… ఈ అనుభవం కూడా అలాంటిదే. అందరూ దైర్యంగా ఉండండి తప్పకుండా మనం ఈ కరోనాను జయించగలం` ప్రజల్లో మనోధైర్యాన్ని నింపాం అని ఆయన ఆ విడియోలో తన అనుభవాన్ని వివరించారు.

Leave a Reply