32 వేలు దాటిన కరోనా మృతులు

0
189

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా మహా ఉత్పాతం సృష్టిస్తోంది. అంతర్జాతీయం ఈ మహమ్మారి బారిన పడి 32 వేల మంది పైగా మృత్యువాత పడ్డారు. కోవిడ్‌-19 సోకి ఇప్పటివరకు 32,144 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో మృతుల సంఖ్య 10 వేలు దాటేసింది. కరోనా బారిన పడిన వారి సంఖ్య ఏడు లక్షలకు చేరువైంది. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 6,83,640 మందికి కరోనా సోకింది. దాదాపు లక్షన్నర మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బారిన పడినవారి సంఖ్య 1,23,828కు చేరుకుంది. ఇటలీలో 92,472, చైనాలో 81,439, స్పెయిన్‌లో 78,797, స్పెయిన్‌లో 58,247, ఇరాన్‌లో 38,309 మందికి కరోనా సోకింది. భారత్‌లో ప్రభుత్వం అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,091కి చేరింది.

స్పెయిన్‌ విలవిల
యూరోపిన్‌ దేశాల్లో ఇటలీ తర్వాత స్పెయిన్‌పై కరోనా పంజా విసిరింది. కోవిడ్‌-19 విజృంభణతో స్పెయిన్‌ యువరాణి మరియా థెరిసా కూడా ప్రాణాలు విడిచారు. స్పెయిన్‌లో ఇప్పటివరకు 6,528 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మరణాల్లో స్పెయిన్‌ రెండో స్థానంలో ఉంది. ఇటలీ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలోనూ కరోనా మరణాలు వేగంగా పెరుగుతున్నాయి. అమెరికాలో ఇప్పటి వరకు 2,229 కరోనాతో మృతి చెందారు.

Leave a Reply