11 లక్షల మంది​కి ‘కోవిడ్‌’

0
308

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పట్లో ఆగేట్టు కనబడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 బారిన పడుతున్న బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా సోనిక వారి సంఖ్య శనివారం మధ్యాహ్నానికి 11 లక్షలు దాటేసింది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ డేటా ప్రకారం ఇప్పటివరకు 11,00,283 మంది కోవిడ్‌ బారిన పడగా, 59,200 మంది మృతి చెందారు. 2,14,459 మంది కోలుకున్నారు.

ఐరోపాలో ఆగని మరణాలు
అమెరికాలో 2,77,475 మందికి కరోనా సోకింది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 7,402 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో 1,19,827 కోవిడ్‌ బారిన పడగా, 14,681 మంది మృత్యువాత పడ్డారు. స్పెయిన్‌లో 1,19,199 మందికి వైరస్‌ సోకగా, 11,198 మంది చనిపోయారు. జర్మనీలో 91,159 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,275 మంది మరణించారు. ఫ్రాన్స్‌ లో 64,338 మందికి కరోనా వ్యాపించగా, 6,507 మంది బలైయ్యారు. కరోనా మరణాలతో ఐరోపా, అమెరికా దేశాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. శ్మశాన వాటికలు కిక్కిరిసిపోతున్నాయి.

భారత్‌లో 3 వేలు దాటాయి
భారత దేశంలో ఇప్పటివరకు 3,041 కరోనా ప్రభావానికి గురయ్యారు. శుక్రవారం ఒక్కేరోజే దేశవ్యాప్తంగా 534 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 490, తమిళనాడులో 411, ఢిల్లీలో 386, కేరళలో 296, తెలంగాణలో 229, ఉత్తరప్రదేశ్‌లో 174, ఆంధ్రప్రదేశ్‌లో 164 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 211 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. కాగా, కోవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి సరైన రక్షణ పరికరాలు లేవన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Leave a Reply