భారత్‌లో 21 వేలు దాటిన కేసులు

0
194

భారత్‌లో కోవిడ్‌–19 విజృంభణకు అడ్డుకట్ట పడటం లేదు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌–19 బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. గురువారం ఉదయం నాటికి ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసులు 21 వేలు దాటిపోయాయి. తాజా సమాచారం ప్రకారం 21,797 మందికి కరోనా సోకింది. 681 మరణాలు సంభవించగా, కోవిడ్‌ నుంచి 4,376 మంది కోలుకున్నారు. ఒక్క మహరాష్ట్రలోనే 6,710 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌(2407), ఢిలీ(2248), రాజస్థాన్‌(1890), తమిళనాడు(1629) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

కరోనా మరణాల్లోనూ మహారాష్ట్ర ముందుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 269 మంది మృతి చెందగా, ఆ తర్వాత గుజరాత్‌(103), మధ్యప్రదేశ్‌(80), ఢిల్లీ(48), రాజస్తాన్‌(27) నిలిచాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. రాజస్థాన్‌(27), ఆంధ్రప్రదేశ్‌(24), తెలంగాణ(23), ఉత్తరప్రదేశ్‌(21), తమిళనాడు (18), కర్ణాటక(17), పంజాబ్‌లో 16 మంది, పశ్చిమ బెంగాల్‌లో 15 మంది మరణించారని తెలిపింది.

ముంబైలో లక్షల్లోనే కేసులు!
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా పాజిటివ్‌ కేసులు లక్షల్లోకి చేరే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఐదుగురు సభ్యుల బృందం అంచనా వేసింది. ఏప్రిల్‌ 16వ తేదీన ఈ కమిటీ తెలిపిన ప్రకారం.. ఏప్రిల్‌ 30వ తేదీ నాటికి ముంబైలో కరోనా బాధితుల సంఖ్య 42,604కు, మే 15వ తేదీ నాటికి ఈ సంఖ్య 6,56,407కి చేరుతుంది. అప్పటికల్లా 13,636 వెంటిలేటర్లు, 4,83,000 ఐసోలేషన్‌ బెడ్ల కొరత ఉంటుంది. ముంబైలో ఏప్రిల్‌ 30వ తేదీ నాటికి ఆక్సిజన్‌ సరఫరా లేని ఐసోలేషన్‌ బెడ్లు 30,481, ఆక్సిజన్‌ సపోర్ట్‌తో కూడినవి 5,466 వరకు అవసరమవుతాయి.

Leave a Reply