పేదరికంలోకి 50 కోట్ల మంది…

0
599

– కరోనా దెబ్బకు తలకిందులైన జీవనప్రమాణాలు
– రెండు దశాబ్దాల పురోగతికి ముప్పు ! : డబ్ల్యూహెచ్‌వో, ప్రపంచ బ్యాంకు

జెనీవా : కరోనా మహమ్మారి కారణంగా రెండు దశాబ్దాల పురోగతికి ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. మరీ ముఖ్యంగా యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజీ పురుగతిపై తీవ్ర ప్రభావం చూపి.. దాని పురోగతిని దెబ్బతీసే అవకాశముందని తెలిపింది. ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థల నివేదికలు ప్రస్తావించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. వైద్య సేవల కోసం సొంతంగా ఖర్చుపెట్టాల్సి రావడంతో 50 కోట్లకంటే ఎక్కువమంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారుకున్నారు. కరోనా పంజా తర్వాత పరిస్థితుల్ని నుంచి తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తోన్న దేశాలలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇక సమయం లేదనీ, ప్రపంచ దేశాలన్నీ వెంటనే స్పందించాలని పేర్కొంది. పేదరికం పెరగడం, ఆదాయాలు తగ్గడం, ప్రభుత్వాలు కఠినమైన ఆర్థిక పరిమితులను ఎదుర్కొంటున్నందున.. ఈ ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని ఈ రెండు అంతర్జాతీయ సంస్థల నివేదికలు హెచ్చరించాయి. ‘కొవిడ్‌ మహమ్మారికి ముందే దాదాపు 100 కోట్ల మంది తమ ఆదాయంలో 10 శాతానికి పైగా ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనివల్ల పేదలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆర్థిక పరిమితుల మధ్య ప్రభుత్వాలు వైద్య సేవల వ్యయాన్ని పెంచేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని ప్రపంచ బ్యాంకుకు చెందిన జువాన్‌ ఉరిబె వెల్లడించారు. మహమ్మారికి ముందు 68 శాతం మందికి అత్యవసర వైద్య సేవలు అందేవని చెప్పారు.

‘ఏ మాత్రం సమయం లేదు. ప్రపంచ దేశాలు తమ పౌరులంతా ఆర్థిక పరిణామాలకు భయపడకుండా ఆరోగ్య సేవల్ని పొందగలరని నిర్ధారించే ప్రయత్నాలను వెంటనే తిరిగి ప్రారంభించాలి. వాటిని వేగవంతం చేయాలి. వైద్య సేవలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం కీలకం. అలాగే ఇంటికి దగ్గర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలి. మహమ్మారికి ముందు సాధించిన పురోగతి అంత బలంగా లేదు. ఈసారి భవిష్యత్తుల్లో ఎదురయ్యే మహమ్మారులను తట్టుకునేలా వ్యవస్థల్ని నిర్మించాలి. అలాగే యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌ దిశగా నిర్ణయాలు తీసుకోవాలి’ అని ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ సూచించారు. పేదలు వైద్యం కోసం డబ్బులు వెచ్చించే పరిస్థితి నుంచి వారిని మినహాయించాల్సి ఉందని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందుకోసం పేద, బలహీన వర్గాలకు సేవలు అందించేలా పథకాలు రూపొందించాలని సూచించింది.

Courtesy Nava Telangana

Leave a Reply