కామ్రేడ్ ఉసా నీల్ లాల్ ఆలోచన పురోగమనానికి నిదర్శనం

Tags- critisism on USAA, reflection on LAL, Neel ideologies power, class, caste, Marx, Ambedkar , Dandi Venkat article

0
313

కామ్రేడ్ ఉసా నీల్ లాల్
ఆలోచన పురోగమనానికి
నిదర్శనమే ఆయనపై
మూస ఆధిపత్యవాదుల
సైద్ధాంతిక దాడి..!
★★

ఒక ప్రగతిశీలత దినదినాభివృద్ద
చెందాలంటే వందల వేల సంవత్సరాలు పట్టవచ్చు
ప్రగతి నిరోధక శక్తుల
ఆటంకాలతో తాత్కాలికంగా ఆగిపోవచ్చు.
విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందడానికి ఎక్కవకాలం పట్టవచ్చునేమో కానీ
మానవ పరిణామ క్రమంలో
శ్రమ ఆధారిత విజ్ఞాన శాస్త్రమే మానవ సమాజ పురోభివృద్ధికి కారణమైయ్యింది.
అవిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తుంది
అవిజ్ఞానంలో అభివృద్ధిని చూడమంటే ఆవు మూత్రంతో
కరోనాకు మందు కనుగొనట్టే ఉంటుంది.

ఇటీవల కాలంలో
ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు
కామ్రేడ్ ఉసా
స్మారక ఉపన్యాసంపై
కొందరు వ్యక్తులు స్పందిస్తున్నతీరు
ఉసా గారి బహుజన రాజకీయ
సైద్ధాంతికతను
నోటితో పొగుడుతు
నొసటితో వెక్కిరిస్తున్నారు.
ఐలయ్య గారి ఉసా స్మారక ఉపన్యాసం నేను వినలేదు కానీ
రాఘవ శర్మ గారి స్పందనను
చదివితే ఐలయ్య గారి ఉసా స్మారక ఉపన్యాస సారంశం అర్థం చేసుకోవచ్చు.
కమ్యూనిస్టు,విప్లవోద్యమాలకు
బహుజన నాయకత్వాలే
బ్రాహ్మణాధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయమవుతుందని
కామ్రేడ్స్: కేజీ సత్యమూర్తి గారి నుండి మారోజు వీరన్న,
ఉసా గార్ల వరకు
ఫూలే-అంబేద్కరిజాన్ని
మార్క్సిజీకరించిన
విషయం తెల్సిందే.

కుల వివక్షత ఉంటే
కేజీ సత్యమూర్తి గారు గత పీపుల్స్ వార్ పార్టీలో
ఆ స్థాయికి ఎలా ఎదిగారని శర్మ గారు ప్రశ్నించారు.
కమ్యూనిస్టు పార్టీల నిర్మాణంలో
ఒక వ్యక్తి ప్రధాన కార్యదర్శిగా
ఎన్నికకావలంటే
ఆ నిర్మాణానికి ఉండే
ముఖ్యమైన కమిటీ
పొలిట్ బ్యూరో,కార్యదర్శి వర్గంలో
సభ్యులైఉండాలి,అందులోనూ
సీనియారిటీ అయిఉండాలి.
ఆయా కమ్యూనిస్టు,విప్లవ పార్టీల్లో
సైద్ధాంతిక భిన్నాభిప్రాయాలు
ఉన్న బహుజన జాతులకు చెందిన వ్యక్తులెవరిని

సాధ్యమైనంత వరకు
పొలిట్ బ్యూరో,కార్యదర్శి వర్గంలోకి రాకుండా ముందే
ఇనుపకంచ వేస్తారు.
సైద్ధాంతిక ఆచరణపై
భిన్నాభిప్రాయాలున్న
బహుజన జాతుల నుండి
వచ్చిన వారిని కమిటీల్లో
ఐక్యంగా ఉండకుండా
అందులో మెరిట్ ఉండి
పై నాయకత్వానికి ఎదిగేందుకు అవకాశం ఉందని ముందే పసిగట్టిన ఆధిపత్య నాయకత్వం

బట్టిగాల్చి పోగ రాజేస్తారు.
సైద్ధాంతిక భిన్నాభిప్రాయాలున్న
వ్యక్తి , పై కమిటీకి
ఒకవేళ పోటీ చేసి ఓటింగ్ ద్వారా ఎన్నికైనా అతను ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగలేడు
అప్పటి వరకు ఏలాంటి రాజకీయ అవగాహన లేని బహుజన జాతుల నుండి వచ్చిన వారు
మూస ఆధిపత్య భావజాలపు కుట్రవాదులు చేసే ప్రచారం
పకడ్బందీగా కట్టుదిట్టంగా ఉంటుంది.
అదే నిజమని నమ్మి తాము ఎక్కిన చెట్టును తామే
నరికేస్తారు.

రాజకీయ వెనుకబాటుతనానికి
చిరునామలైన
అవగాహన లేని సహచర బహుజన జాతుల నుండి వచ్చిన
తోటి కామ్రేడ్స్ మద్దతు లేనప్పుడు
బయటకు వెల్లకతప్పదు.
ఇది నా 33 సంవత్సరాల
కమ్యూనిస్టు జీవితనుభవం కూడా.
★★

50,60 యేళ్ళ జీవితంలో ఎన్నో అక్రమ కేసులు,నెలలు, సంవత్సరాలు జైలు జీవితాలను అనుభవించి, వ్యక్తులుగా
బయటకు వచ్చిన వారు
మరో ఉద్యమాన్ని ఎలా నిర్మించగలరు…?
చిన్న నాటి స్నేహితులను, బంధువులను వదిలేసి సాధారణ ప్రజాజీవితంలో బతికిన వారికి
అప్పటి వరకు
ఉద్యమ సంబధాలతో ఉన్న పరిచయాలను
ఆర్థిక సహకారం అడగడానికి
ఆత్మగౌరవం అడ్డొస్తుంది.

ఉద్యమంలో ఉన్నప్పుడు ఏర్పడి శత్రువు సంబంధాలు వెంటాడుతుంటాయి
సహాయం పొందిన వారు మొకంచాటేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో
ముందు తిండి,బట్టలు,
ఇంటి కిరాయి,
అప్పటికే శరీరంలోకి
వచ్చి చేరిన షుగర్,బీపీ తదితర రోగాలు ఒకవైపు వేదిస్తుంటాయి.
మరోవైపు తీవ్రమైన మానసిక ఒత్తిడి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను కూడగట్టి కొత్త ఉద్యమాన్ని ఎలా నిర్మిస్తారు ఎవరైనా…?
అప్పటి వరకు ఆయా

నిర్మాణాలకు మండల జిల్లా, రాష్ట్ర, కేంద్రం వరకు నిర్మించిన వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆఫీసులు, ఉద్యమ అవసరాలకు వచ్చిన ఆర్థిక వనరులు
ఎఫ్ డిలు లాంటి ఆస్తులన్ని
ఆధిపత్య వాదనలు ముందే
తమ ఏజెంట్ లు ఎవరైతే ఉంటారో వారిపేరుతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తారు లేదా తమ పేరుతోనే చేయించుకుంటారు.
ఎవరైతే భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటారో వారిని కావాలనే ఒంటరి చేయడానికి
వివిధ కమిటీలో పొగుడుతుంటారు.

కానీ నాయకత్వ భాధ్యులు
ఇవ్వరు
ఎవరైతే వారికి బానిసలుగా ఉంటారో వారిని కమిటీల్లో తమ పాలేరు కంటే హీనంగా చులకనగా మాట్లాడుతారు

ఈ కుట్రలు తెలియక కొంతమంది అమాయకులైన కొంత మంది కామ్రేడ్స్
తెగించి పార్టీ కోసం పని చేస్తుంటారు.
అవకాశం కోసం ఎదురుచూసే
ప్రగతిశీల ముసుగు,
మూస అభివృద్ధి నిరోధక శక్తులైన
ఆధిపత్యవాదులు
ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించన
ఉద్యమం నుండి వెల్లిపోయే విధంగా చేస్తారు.

అది కామ్రేడ్స్:కేజీ సత్యమూర్తి,మారోజు వీరన్న, ఉసా,ప్రొఫెసర్ కంచె ఐలయ్య లాంటి ప్రముఖ లనుండి నాలాంటి సామాన్య కార్యకర్తల వరకు
జరిగిన,జరుగుతున్న ప్రతీఘాతక చర్యల్లో భాగమేఅని చెప్పకతప్పదు..
మొన్నటిరోజు సిపిఐ ఎంఎల్ పార్టీ
తరుపున కామ్రేడ్ ఝాన్సీ గారి పేరుతో
ప్రకటన కానివ్వండి,
నేడు రాఘవ శర్మ,రేపు మరో
రెడ్డి లేదా రావు, వర్మ,గుప్తా,
ఇంకా లేదనుకుంటే
శూద్రబానిస ఎవరైనా సరే
అభివృద్ధి నిరోధక ఆధిపత్య భావజాలపు వారసుల
వాదనలే అవుతాయనడంలో
ఏలాంటి సందేహం లేదు..

ఆధిపత్య వాదులు
కామ్రేడ్ ఉసా సైద్ధాంతికతపై
దాడి చేస్తున్నారంటేనే
వారు ఇంతకాలం కప్పుకున్న
ప్రగతిశీల ముసుగు చినిగిపోయో
దశ ప్రారంభమైందన్నమాట…
జైభీం లాల్ సలాంలతో..

దండి వెంకట్
కన్వీనర్
బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్
తెలంగాణ రాష్ట్ర కమిటీ.

Leave a Reply