యూపీలో మరో దారుణం

0
263

దళిత బాలికకు నిప్పు..
చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
నలుగురిపై కేసు నమోదు

లక్నో: దేశంలో ప్రతిరోజు ఏదొక చోట మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయక ఆడపిల్లలు తమ ప్రాణాలను కోల్పోతూనే ఉన్నారు. గత నెల చివర్లో ఓ వ్యాపారి.. దళిత బాలికపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన ఘటనలో బాధితురాలు చిక్సిత పొందుతూ.. ఆదివారం మృతిచెందింది. ఈ ఘటన యూపీలోని బరేలీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిలిభితికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను కాన్పూర్‌లోని సమీప బంధువు ఇంట్లో వదిలిపెట్టివచ్చారు. వారు మరుసటి రోజు ఆ బాలికను ఓ వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా పనికి కుదిర్చారు. ఈ క్రమంలో గతనెల 25న, సదరు వ్యాపారి బాలిక తండ్రికి ఫోన్‌ చేసి.. తమ కుమార్తెను ఆనారోగ్యంతో బరేలీలోని ఆస్పత్రిలో చేర్పించినట్టు సమాచారమిచ్చాడు. హుటాహటిన బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకోగా..ఆ వ్యాపారి వారితో బలవంతంగా ఖాళీ పత్రాలపై సంతకం చేయించుకున్నాడు. తర్వాత మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని మరొక ఆస్పత్రి తరలించారు. కానీ బాధితురాలి పరిస్థితి విషమించడంతో.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసున్నామని పోలీసులు తెలిపారు. తమ దర్యాప్తులో నలుగురిని నిందితులుగా గుర్తించామనీ, కేసులో పూర్తి వివరాలు తెలువల్సి ఉన్నదనీ, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Courtes Nava telangana 

Leave a Reply