9 ఏళ్ల బాలికపై శ్మశానంలో హత్యాచారం!

0
356

కాటికాపరి సహా నలుగురి అరెస్టు

దిల్లీ: దేశ రాజధానిలో 9 ఏళ్ల దళిత బాలిక ఒకరు అనుమానాస్పద రీతిలో మృతిచెందడం కలకలం రేపింది. ఓ కాటికాపరితో పాటు మరికొందరు ఆమెపై అత్యాచారం చేసి చంపారని, పోలీసులకు తెలియకుండా ఉండేందుకు ఆమె మృత దేహాన్ని హడావుడిగా దహనం చేశారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్లీలోని పాత నంగల్‌ గ్రామంలో ఆదివారం ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో కాటికాపరి సహా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలి కుటుంబం శ్మశానానికి ఎదురుగా ఉన్న ఇంట్లో నివసిస్తోంది. అక్కడ ఉన్న వాటర్‌కూలర్‌ నుంచి నీళ్లు తెస్తానని ఆ చిన్నారి తన తల్లికి చెప్పి వెళ్లింది. అరగంట తర్వాత కాటికాపరి రాధేశ్యామ్‌ ఆమె తల్లి వద్దకు వచ్చి విద్యుదాఘాతంతో బాలిక మరణించినట్లు చెప్పాడు. పోలీసులకు ఈ విషయం తెలిస్తే పోస్ట్‌మార్టం పేరుతో ఇబ్బంది పెడతారని చెప్పి బలవంతంగా  మృతదేహాన్ని దహనం చేయించాడు. బాలిక తండ్రికి విషయం తెలిసి పోలీసులకు ఫోన్‌ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు అక్కడ కాలిపోయిన బాలిక కాళ్లు మాత్రమే లభ్యమయ్యాయి. బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు చెప్పారు.

Courtesy Eenadu

Leave a Reply