నూతన్‌నాయుడు అరెస్టు

0
236

కర్ణాటకలో పట్టుకున్న పోలీసులు
శిరోముండనం కేసులో నిందితుడు

మహారాణిపేట(విశాఖ), సెప్టెంబరు 4: ‘‘ఫలానా కేసులో నిందితురాలిగా వస్తున్న మహిళ నాకు కావాల్సిన వ్యక్తి. ఆమెను జైలుకు పంపకుండా ఏదో ఒక సమస్య ఉందని చెప్పి వారం, పది రోజులు ఆస్పత్రిలో ఉండేలా చూడండి’’ అని కోరడంతో అనుమానం వచ్చిన డాక్టర్‌ సుధాకర్‌ వెంటనే తన వద్ద ఉన్న పీవీ రమేశ్‌ వేరే నంబర్‌కు ఫోన్‌ చేసి విషయం తెలిపారన్నారు. అయితే, తానెవరికీ ఫోన్‌ చేయలేదని, ఎవరో తనపేరును దుర్వినియోగం చేస్తున్నట్టుందని పీవీ రమేశ్‌ అనుమానం వ్యక్తం చేయడంతో వెంటనే డాక్టర్‌ సుధాకర్‌ తనకు ఫిర్యాదు చేశారని సీపీ వివరించారు. నూతన్‌నాయుడు అక్కడితో ఆగలేదని, డాక్టర్‌ సుధాకర్‌కు ఫోన్‌ చేసిన తర్వాత కేజీహెచ్‌లోని మరో డాక్టర్‌ వాసుదేవ్‌కి ఫోన్‌ చేసి ‘ఒకవేళ డాక్టర్‌ సుధాకర్‌ చూడకుండా పెందుర్తి కేసు నిందితులను మీ వద్దకు పంపిస్తే అనారోగ్యం పేరుతో వారిని ఆస్పత్రికే పరిమితం చేయా’లని కోరాడని సిన్హా తెలిపారు. అనంతరం ఇండస్‌ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ సుజాతకు ఫోన్‌ చేసి పెందుర్తి కేసులో నిందితులను కేజీహెచ్‌కు తీసుకువస్తున్నారని, మహిళ అయినందున అక్కడి నుంచి మీ ఆస్పత్రికి రిఫర్‌ చేస్తే.. ఆస్పత్రికే పరిమితం చేయాలని ఆమెను కూడా కోరాడని సీపీ తెలిపారు.

దీంతో డాక్టర్‌ సుధాకర్‌ను సంప్రదించిన డాక్టర్‌ వాసుదేవ్‌, సుజాతలు అది తప్పుడు కాల్‌ అని చెప్పడంతో వారిద్దరూ కూడా ఆ విషయం తన దృష్టికి విషయాన్ని తెచ్చారని సిన్హా వివరించారు. దీంతో అనుమానించిన తాము ఆ ఫోన్‌ నంబర్‌పై నిఘా పెట్టగా అది నూతన్‌నాయుడిదని గుర్తించామన్నారు. ఏకంగా పీవీ రమేశ్‌ పేరుతోనే సిమ్‌ తీసుకున్నట్లు గుర్తించారు. కాగా, ఘటన జరిగిన రోజు నూతన్‌నాయుడు పెందుర్తిలోనే ఉన్నాడని పోలీసులు నమ్ముతున్నారు. శ్రీకాంత్‌ వచ్చేసరికి పక్కగదిలో ఉన్నాడని, వీడియోకాల్‌లో అంతా చూపించాలని భార్యను కోరి అంతా ఫోన్‌లో వీక్షించాడని భావిస్తున్నారు.

విశాఖజిల్లా పెందుర్తిలో దళిత యువకుడి శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్‌ నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపిలో ఉన్నట్టు గుర్తించి గురువారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ మనీ్‌షకుమార్‌ సిన్హా తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే నూతన్‌ భార్య సహా ఏడుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కమిషనరేట్‌లో శుక్రవారం సీపీ సిన్హా మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 28న నూతన్‌నాయుడు ఇంటికి బాధితుడు శ్రీకాంత్‌ వెళ్లాడని, అదే రోజు మధ్యాహ్నం 2:50 గంటలకు ఒకసారి, 3:09 గంటలకు మరోసారి నూతన్‌నాయుడు తన భార్యతో వీడియో కాల్‌చేసి మాట్లాడినట్టు గుర్తించామని సీపీ తెలిపారు. వీటి ఆధారంగా ఈ ఘటనలో నూతన్‌నాయుడు పాత్ర ఉందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చామన్నారు. పైగా గత నెల 29న పోలీసులు నిందితులను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించిన సమయంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి(రిటైర్డ్‌) పీవీ రమేశ్‌ పేరుతో కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుధాకర్‌కు ఫోన్‌ వచ్చిందని సీపీ తెలిపారు. ‘‘ఫలానా కేసులో నిందితురాలిగా వస్తున్న మహిళ నాకు కావాల్సిన వ్యక్తి. ఆమెను జైలుకు పంపకుండా ఏదో ఒక సమస్య ఉందని చెప్పి వారం, పది రోజులు ఆస్పత్రిలో ఉండేలా చూడండి’’ అని కోరడంతో అనుమానం వచ్చిన డాక్టర్‌ సుధాకర్‌ వెంటనే తన వద్ద ఉన్న పీవీ రమేశ్‌ వేరే నంబర్‌కు ఫోన్‌ చేసి విషయం తెలిపారన్నారు. అయితే, తానెవరికీ ఫోన్‌ చేయలేదని, ఎవరో తనపేరును దుర్వినియోగం చేస్తున్నట్టుందని పీవీ రమేశ్‌ అనుమానం వ్యక్తం చేయడంతో వెంటనే డాక్టర్‌ సుధాకర్‌ తనకు ఫిర్యాదు చేశారని సీపీ వివరించారు. నూతన్‌నాయుడు అక్కడితో ఆగలేదని, డాక్టర్‌ సుధాకర్‌కు ఫోన్‌ చేసిన తర్వాత కేజీహెచ్‌లోని మరో డాక్టర్‌ వాసుదేవ్‌కి ఫోన్‌ చేసి ‘ఒకవేళ డాక్టర్‌ సుధాకర్‌ చూడకుండా పెందుర్తి కేసు నిందితులను మీ వద్దకు పంపిస్తే అనారోగ్యం పేరుతో వారిని ఆస్పత్రికే పరిమితం చేయా’లని కోరాడని సిన్హా తెలిపారు. అనంతరం ఇండస్‌ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ సుజాతకు ఫోన్‌ చేసి పెందుర్తి కేసులో నిందితులను కేజీహెచ్‌కు తీసుకువస్తున్నారని, మహిళ అయినందున అక్కడి నుంచి మీ ఆస్పత్రికి రిఫర్‌ చేస్తే.. ఆస్పత్రికే పరిమితం చేయాలని ఆమెను కూడా కోరాడని సీపీ తెలిపారు. దీంతో డాక్టర్‌ సుధాకర్‌ను సంప్రదించిన డాక్టర్‌ వాసుదేవ్‌, సుజాతలు అది తప్పుడు కాల్‌ అని చెప్పడంతో వారిద్దరూ కూడా ఆ విషయం తన దృష్టికి విషయాన్ని తెచ్చారని సిన్హా వివరించారు. దీంతో అనుమానించిన తాము ఆ ఫోన్‌ నంబర్‌పై నిఘా పెట్టగా అది నూతన్‌నాయుడిదని గుర్తించామన్నారు. ఏకంగా పీవీ రమేశ్‌ పేరుతోనే సిమ్‌ తీసుకున్నట్లు గుర్తించారు. కాగా, ఘటన జరిగిన రోజు నూతన్‌నాయుడు పెందుర్తిలోనే ఉన్నాడని పోలీసులు నమ్ముతున్నారు. శ్రీకాంత్‌ వచ్చేసరికి పక్కగదిలో ఉన్నాడని, వీడియోకాల్‌లో అంతా చూపించాలని భార్యను కోరి అంతా ఫోన్‌లో వీక్షించాడని భావిస్తున్నారు.

Leave a Reply