నృత్య దర్శకురాలు టీనా గుండెపోటుతో మృతి!

0
228

గోవాలో మరణించినట్లు వెల్లడించిన ఆమె స్నేహితుడు సందీప్‌

హైదరాబాద్‌ : ప్రముఖ నృత్య దర్శకురాలు, రియాలిటీ డ్యాన్స్‌ షో ‘ఆట’ ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు సాధించిన టీనా సాధు గుండెపోటుతో మరణించారు. గోవాలో ఉన్న ఆమెకు.. బుధవారం గుండెపోటు రావడంతో మృతి చెందారని ఆమె స్నేహితుడు ‘ఆట’ సందీప్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే.. టీనా మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మితిమీరి మద్యం తాగడం వల్లే ఆమెకు గుండెపోటు వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. కొంతకాలంగా టీనా.. భర్తతో కలసి గోవాలోనే ఉంటున్నారనీ కొందరు అంటుండగా.. రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌ నుంచి స్నేహితులతో గోవా వెళ్లిందని మరికొందరు చెబుతున్నారు. దీంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ‘ఆట’ రియాలిటీ డ్యాన్స్‌ షో ద్వారా వెలుగులోకి వచ్చిన టీనా.. ‘ఆట’ సీజన్‌ 4కు జడ్జిగా వ్యవహరించారు. అలాగే, కొన్ని సినిమాలు, సీరియల్స్‌కు నృత్య దర్శకురాలిగా పని చేశారు.

Leave a Reply