ఏ రోజు.. ఏ లక్షణం?

0
253

కరోనా మహమ్మారి మనదేశంలోనూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో వైరస్‌ లక్షణాల గురించి తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. రోజువారీగా వైరస్‌ లక్షణాలు ఎలా వృద్ధి చెందుతాయో సింగపూర్‌ వైద్య శాఖ ఒక వీడియో విడుదల చేసింది. అవి.. 

1-3 రోజులు
ఫ్లూ, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం కూడా వస్తుంది. స్వల్పంగా లేదా పూర్తిగా గొంతు నొప్పి, కొందరికి డయేరియా వచ్చే అవకాశమున్నది.

4వ రోజు
గొంతు నొప్పి తీవ్రత పెరుగుతుంది. మాట్లాడటం కష్టమవుతుంది. శరీర ఉష్ణోగ్రత 36.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటుంది. తలనొప్పి, డయేరియా కలుగుతాయి.

5వ రోజు
పరిస్థితులు విషమించడం మొదలవుతుంది. గొంతు నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఒళ్లు, కీళ్ల నొప్పులు ఉంటాయి. నీరసంగా అనిపిస్తుంది.

6వ రోజు
37 డిగ్రీల జ్వరం, దగ్గు, గొంతునొప్పి అధికం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నుంచి వేళ్ల వరకునొప్పి, అలసట ఉంటాయి. వాంతులు, విరేచనాలవుతాయి.

7వ రోజు
జ్వరం తీవ్రత పెరుగుతుంది. 38 డిగ్రీల వరకు చేరుతుంది. దగ్గు అధికమవుతుంది. కఫం కూడా వస్తుంటుంది. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, డయేరియా, వాంతులు తీవ్రమవుతాయి.

8వ రోజు
శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. ఛాతీ భారంగా అనిపిస్తుంది. దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు మరింత అధికమవుతాయి. జ్వరం 38 డిగ్రీలు దాటుతుంది.

9వ రోజు
అన్ని లక్షణాలు బయటపడుతాయి. విషమించడం మొదలవుతుంది.

ఎమర్జెన్సీ వార్నింగ్‌లక్షణాలు
శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది, ఛాతి నొప్పి.. పెదవులు, ముఖం నీలిరంగులోకి మారడం.
జ్వరం, దగ్గు, శ్వాస ఇబ్బంది ఉంటే వైద్యసాయం తీసుకోవాలి.

Courtesy Namasthe Telangana

Leave a Reply