పోస్టులు 8వేలు.. అభ్యర్థులు 12లక్షలు

Tags-india, Democracy In danger, Economist study, ranking down, Kashmir, Citizenship Act agitations, restrictions, freedom in danger

0
218

– మహారాష్ట్ర కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌లో..

ముంబయి: దేశంలో తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఉన్నదనీ, ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించగా, అది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకునేందుకు మహారాష్ట్ర చిన్నపాటి నిదర్శనంగా నిలిచింది. వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలో ఎనిమిది వేల కానిస్టేబుల్‌ పోస్టులకు ఏకంగా 12లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దరఖాస్తులు భారీ స్థాయిలో రావడంతో ఇంతమందికి ఒకేసారి పరీక్ష ఎలా నిర్వహించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సి ఉండగా, అందుకు కనీసం 45రోజుల సమయం పడుతుంది. దీంతో పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుండగా, దీనిపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలను ఒకే రోజున ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని కోరుతున్నారు. దీనిపై రాష్ట్ర హౌంమంత్రి సతేజ్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో 45రోజుల పాటు పరీక్షలు నిర్వహించాల్సి వస్తే, 90సెట్ల ప్రశ్నా పత్రాలు తయారుచేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ, అభ్యర్థులు ఒకే ప్రశ్నాపత్రంతో ఒకే రోజున పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారనీ, దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుని పరీక్షా తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

Courtesy Nava telangana

Leave a Reply