ఆయన్ని పిలవనే లేదు… ‘హిస్టరీ కాంగ్రెస్‌ ‘ సదస్సుకు కేరళ గవర్నరే ఆటంకాలు కల్పించారు

0
241
ఆయన్ని పిలవనే లేదు...

Image result for ఆయన్ని పిలవనే లేదు..."ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ కీలకవ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ‘ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌’ (ఐహెచ్‌సీ) 80వ సదస్సుకు కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను పిలవనేలేదనీ, సదస్సు సజావుగా జరగకుండా గవర్నరే ఆటంకాలు కల్పించారనీ ప్రముఖ చరిత్రకారుడు, ఐహెచ్‌సీ అధ్యక్షుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ విమర్శించారు. ఐహెచ్‌సీ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తూ (గత శనివారం) గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం జాతీయ వార్తల్లో నిలిచింది.

స్వాతంత్రోద్యమ నాయకుడు మౌలానా ఆజాద్‌ మాటల్ని వక్రీకరించటం తీవ్రదుమారం రేపింది. సదస్సులో గవర్నర్‌ వ్యాఖ్యల్ని ఇర్ఫాన్‌ హబీబ్‌ అడ్డుకున్నారు. వివిధ యూనివర్సిటీల నుంచి సదస్సుకు హాజరైన ప్రొఫెసర్లు, మేథావులు కూడా గవర్నర్‌ పేర్కొన్న మాటల్ని తప్పుబట్టారు. మరోవైపు సభికుల్లో కొంతమంది ఆయన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో సదస్సులో గందరగోళం ఏర్పడి, కొద్దిసేపు ఆటంకం ఏర్పడింది.

సదస్సులో జరిగిన గందరగోళంపై తాజాగా ఇర్ఫాన్‌ హబీబ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే…” ఐహెచ్‌సీ అధ్యక్షుడిగా చెబుతున్నా…ఈ సదస్సుకు గవర్నర్‌ మహమ్మద్‌ ఖాన్‌ను పిలవలేదు. కన్నూర్‌ వర్సిటీ అధికారులు ఆయన్ని ముఖ్య అతిథిగా పిలిచిన సంగతి మాకు తెలియదు. ఏ సదస్సుకు అయితే వచ్చారో, అదే ఐహెచ్‌సీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మౌలానా ఆజాద్‌ 1948లో మాట్లాడిన మాటల్ని తప్పుగా కోట్‌ చేస్తుంటే, నేను కలగజేసుకున్నా. నిజానికి పిలవని కార్యక్రమానికి హాజరైన గవర్నరే మా సదస్సుకు ఆటంకాలు కల్పించారు” అని అన్నారు.

(Courtesy Nava Telangana)

Leave a Reply