ట్రాక్టర్‌లో కరోనా మృతదేహాన్ని తరలించిన డాక్టర్‌

0
238

పెద్దపల్లి: కరోనాతో చనిపోయిన రోగిని తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఓ వైద్యుడు మానవత్వం ప్రదర్శించి ముందుకు వచ్చారు. స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అందరి మన్ననలు పొందారు.
పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా బాదితుడు ఆదివారం మృతిచెందారు. మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మున్సిపల్‌ సిబ్బంది ఓ ట్రాక్టర్‌ను తెచ్చి వదిలి వెళ్లిపోయారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.

సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్‌ శ్రీరామ్‌ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. స్వయంగా చొరవ తీసుకున్నారు! బంధువుల సహాయంతో మృతదేహాన్ని ట్రాక్టర్‌లోకి తరలించి.. దానిని శ్మశానం దాకా నడిపారు! పీపీఈ కిట్‌ ధరించి స్టీరింగ్‌ పట్టారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో డాక్టర్‌ శ్రీరామ్‌పై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

 

Leave a Reply