ఆకలి చావుల యూపీ

0
320

– తిండి లేక తనువు చాలిస్తున్న పేదలు
– రెండు నెలల వ్యవధిలో 11 మంది మృతి
– బీజేపీ సర్కారు వైఫల్యం
లక్నో : బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో ఆకలి మరణాలు ఆగటం లేదు. తినడానికి కనీసం తిండి లేక పోషకాహారలోపంతో ఎంతో మంది పేదలు యూపీలో ఆకలితో అలమటిస్తున్నారు. ఫలితంగా అక్కడ ఆకలి చావులు నిత్యకృత్యమవుతున్నాయి. రెండు నెలల వ్యవధిలోనే యూపీలో 11 మంది చనిపోవడం యూపీలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని బీజేపీ సర్కారు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. దీపావళి సందర్భంగా దీపోత్సవం వంటి కార్యక్రమాలకు కోట్లు కుమ్మరించిన యోగి సర్కారు.. ఆకలి చావులపై దృష్టిని సారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరు రోజులు తిండి లేక..!
యూపీలో ఆకలి చావుల తీవ్రత ఎలా ఉన్నదో తెలిపే ఘటన కౌశంబి జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్నది. జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన బలరాం కుటుంబం పేదరికంతో సమస్యలను ఎదుర్కొంటున్నది. 2011 జనాభాలెక్కల్లో ఆ కుటుంబం పేరు గల్లంతయ్యింది. ఈ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేటు ఎంకె వర్మ కూడా ధ్రువీకరించారు. దీంతో ఆ కుటుంబం ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోయింది. అంతేకాకుండా నెలకు వచ్చే రేషన్‌ కూడా నిలిచిపోయింది. పేదరికంతో సమస్యలను ఎదుర్కొంటూ కొంత కాలం వరకు కుటుంబాన్ని పోషించినప్పటికీ ఆ తర్వాత బలరాం ఆరోగ్యపరిస్థితి దారుణంగా తయారైంది. టీబీ వ్యాధిగ్రస్తుడూ అయిన బలరాం.. తినడానికి తిండి లేక ఆరు రోజుల పాటు ఆకలితో అలమటించి బలరాం ఇటీవలే మరణించాడు. ” గత ఆరు రోజులగా మా ఇంట్లో తినడానికి తిండి గింజలు కూడా లేవు. దీంతో ఇన్ని రోజులూ మా నాన్న ఆకలితో అలమటించారు. క్రమంగా అనారోగ్యానికి గురయ్యారు” అని బలరాం కుమార్తె అర్చన తెలిపింది. కాగా, యూపీలో గత రెండునెలల్లోనే ఆకలి మరణాలు 11కు చేరుకున్నాయి. సీతాపూర్‌కు చెందిన ఏడో తరగతి విద్యార్థిని.. ఆకలికి తట్టుకోలేక గతనెల 10న తనకు తాను నిప్పంటించుకున్నది. ఆ తర్వాత తీవ్ర గాయాలతో వారం రోజులకు మరణించింది. పీఎం ఆవాస్‌ యోజన జాబితాలో ఆ కుటుంబం పేరు గల్లంతు కావడంతో.. ఆ పథకం కింద వారికి ప్రయోజనాలూ కలగలేదని మృతురాలి గ్రామస్తుడొకరు తెలిపారు. అలాగే కుషీనగర్‌ జిల్లా దుడాహీ బ్లాక్‌లోని మూడు గ్రామాల్లో ముసహర్‌ కమ్యూనిటీకి చెందిన తొమ్మిది మంది పోషహారలోపం, ఇతర వ్యాధుల కారణంగా చనిపోయారు. వీరంతా

Courtesy Navatelangana…

Leave a Reply