– ఉద్యోగులంతా వీఆర్ఎస్
– వనస్థలిపురం కార్యాలయం మూసివేత
-ఎల్బీనగర్
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి తాళం వేశారు. ఉద్యోగుంతా ఒకేసారి వీఆర్ఎస్ తీసుకోవడంతో కార్యాలయాన్ని మూసేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉద్యోగులు కొందరు బలవంతంగానే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ నగరం పరిధిలోని పలు కార్యాలయాల్లో సుమారు 2400మంది వీఆర్ఎస్ తీసుకున్నారు. చార్మినార్, మలక్పేట, సరూర్నగర్ పరిధిలో దాదాపు 470మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకున్నారు. సరూర్నగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నలుగురు ఉద్యోగులే పని చేస్తున్నారు. అందులోనూ, మరో ఇద్దరు వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతోపాటు వనస్థలిపురం కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అంతా ఒకేసారి వీఆర్ఎస్ తీసుకోవడంతో కార్యాలయం మూతపడింది. ఆ కార్యాలయానికి తాళం వేయడంతో కస్టమర్లు వచ్చి వెనుదిరుగుతున్నారు. లైన్మెన్లు, క్లర్క్లు, బిల్లింగ్ కౌంటర్ సిబ్బంది వీఆర్ఎస్ తీసుకోవడంతో కార్యాలయాల్లోని కౌంటర్లన్నీ మూసేసి ఉన్నాయి.
సెల్ఫోన్, లాండ్లైన్ల కస్టమర్లు బిల్లులు చెల్లించేందుకు సరూర్నగర్ కార్యాలయానికి వస్తున్నారు. అయితే, వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి బెన్ఫిట్స్ ఇవ్వట్లేదని బాధిత ఉద్యోగి రవీందర్రెడ్డి తెలిపారు. మార్చిలో సగం బెన్ఫిట్, జూన్లో సగం బెన్ఫిట్ చెల్లిస్తారని చెప్పారన్నారు. బలవంతంగా ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకున్నారని వాపోయారు. పనిచేయాలని ఉన్నా, ఉద్యోగులు విధిలేక వీఆర్ఎస్ పెట్టుకున్నారని వెల్లడించారు.
Courtesy Nava Telangana