మాజీ ఎమ్మెల్యే ‘తాటి’ కుమార్తె ఆత్మహత్య

0
205

మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఉరేసుకుని డాక్టర్‌ బలవన్మరణం

బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి (28) ఆత్మహత్య చేసుకున్నారు. బూర్గంపాడు మండలం సారపాకలో ని స్వగృహంలో గురువారం తెల్లవారుజామున ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన మహాలక్ష్మి.. ప్రస్తుతం పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో.. మానసిక ఒత్తిడికి లోనైన ఆమె.. తెల్లవారుజామున ఉరి వేసుకున్నారు.  త్రండి తాటి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యురాలిగా పేదలకు సేవ చేయాలనుకున్న తన కూమార్తె.. అర్ధాంతరంగా తనువు చాలించడం పట్ల తాటి వెంకటేశ్వర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయనకు మహాలక్ష్మి ఒక్కగానొక్క కుమార్తెకాగా.. ఓ కుమారు డు ఉన్నారు. భార్య ఏడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. కాగా..  విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే రేగ కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బా లసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య తదితరులు ఆయన నివాసానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply