అది నకిలీది

0
156

– మోడీని కీర్తిస్తూ వచ్చిన కథనంపై న్యూయార్క్‌టైమ్స్‌
– ఫేక్‌ న్యూసని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఇటీవల అంతర్జాతీయ ప్రముఖ వార్తా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ భారత ప్రధాని మోడీని కీర్తిస్తున్నట్టుగా ఫ్రంట్‌ పేజీలో ఓ కథనం వచ్చినట్టు దానికి సంబంధించిన వార్తా ఫొటో తెగ వైరల్‌ అయింది. చాలామంది ఇది నిజమే అనుకుని బాగా షేర్‌ చేశారు. బీజేపీ కార్యకర్తలు, నేతలు సైతం పోటీ పడిమరి షేర్‌ చేశారు. అయితే, మొత్తానికి ఇది ఫేక్‌ న్యూస్‌ అని తేలింది. బీజేపీ అధికార పత్రికలు కూడా చేయనంత భజన అమెరికా పత్రిక చేస్తుందా అనే అనుమానం లేకుండా ఫేక్‌ న్యూస్‌ను షేర్‌ చేశారు. అనుమానం వచ్చిన వాళ్ళు ఫాక్ట్‌ చెక్‌ చేశారు. ఇది ఫేక్‌ అని తేలింది. వివరాల్లోకెళ్తే.. ై’లాస్ట్‌, బెస్ట్‌ హౌప్‌ ఆఫ్‌ ఎర్త్‌’ అనే శీర్షికతో న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తా పత్రిక ఫ్రంట్‌ పేజీ కథనంలో మోడీ గురించి అంటూ ఓఫోటో వెలుగులోకి వచ్చింది. ఈవార్తా కథనం సెప్టెంబర్‌ 26న ప్రచురితమైనట్టుగా తేది ఉంది. దీంతో మోడీ గొప్పతనం అంటూ.. మోడీ భజన ప్రియులు చాలా మంది తెగ షేర్‌ చేశారు. ఇది కాస్తా వైరల్‌ అయింది. ఆ కథనంలో మోడీని విశ్వనేతగా న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొనడం, దీనికి తోడు కథనంలో తప్పులు దొర్లడం, అలాగే, హరహర మహాదేవ అంటూ ఆర్టికల్‌ చివర్లో కనిపించింది. ఫేక్‌ న్యూస్‌ను సృష్టించే క్రమంలో మోడీ భజన బృందం ఇలా తమ భక్తినంత ఆర్టికల్‌లో గుప్పించింది. న్యూయార్క్‌ టైమ్స్‌ ఇలా మోడీని ప్రశంసిస్తుందా? అంటూ కొందరూ ఫ్యాక్ట్‌ చెక్‌ చేయడంతో ఫేక్‌ న్యూస్‌ అని తేలింది. తాజాగా న్యూయార్క్‌ టైమ్స్‌ సైతం దీనిపై క్లారిటీ ఇచ్చింది. మోడీపై ఎలాంటి కథనం తాము ప్రచురించలేదనీ, తమ వార్తాపత్రిక పేరుతో ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ అయిందనీ, దానికి తమకు ఎలాంటి సంబంధం లేదని న్యూయార్క్‌ టైమ్స్‌ స్పష్టం చేసింది.

Courtesy Nava Telangana

Leave a Reply