అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య

0
135

కేసముద్రం : అప్పులు చేసి పంటలు సాగు చేయగా, దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయాడు.. ఈ తరుణంలో ఆ అప్పులు తీర్చే మార్గం లేక ఆ రైతు తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కల్వల శివారు తూర్పుతండాకు చెందిన బానోత్‌ లాల్‌సింగ్‌ (50) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, మిర్చి, పసుపు, మొక్కజొన్న పంటలను సాగు చేశాడు. తెగుళ్లు, అకాల వర్షాలతో పంటలన్నీ పాడయ్యాయి. ఈ క్రమంలో అప్పులు రూ.6 లక్షల వరకు పెరిగిపోయాయి. దీంతో జీవితంపై విరక్తి చెంది ఈనెల 17న పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.

Leave a Reply