నటిపై మాజీ ఎమ్మెల్యే కొడుకు బూతులు

0
317
Search Results Web results నటిపై మాజీ ఎమ్మెల్యే కొడుకు బూతులు

  • పబ్‌లో అసభ్యప్రవర్తన.. ఆమెపై బాటిళ్ల విసిరివేత.. పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
  • వైద్యురాలి హత్యాచారంపై నిరసన తెలిపిన ఆశిష్‌గౌడ్‌
మాదాపూర్‌/హైదరాబాద్‌: ఆయనో మాజీ ఎమ్మెల్యే తనయుడు. వైద్యురాలిపై దారుణ అత్యాచారం, హత్యను నిరసిస్తూ శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. మహిళ ల పట్ల అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా సమాజమంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు! ఇలా ‘ఆదర్శం’ చాటుకున్న ఆయనే ఆ మరుసటి రోజు ఓ పబ్‌లో ఓ సినీనటి చేయిపట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించిన ఆమెను తన స్నేహితులతో కలిసి బూతులు తిట్టాడు. పైగా ఆమెపై బాటిళ్లను విసిరాడు! మహిళల పట్ల ఇలా ఒక్కరోజులోనే తనలోని మరో పార్శ్వాన్ని బయటపెట్టుకున్న ఆ యువకుడు పటాన్‌చెరు మాజీ ఎమ్మె ల్యే నందీశ్వర్‌ కు మారుడు, ఆశి్‌షగౌడ్‌! బాధితురాలేమో హైదరాబాద్‌ మాదాపూర్‌ ఠాణా పరిధిలోని అయ్యప్ప సొసైటీలో ఉంటున్న సినీనటి, బిగ్‌బా్‌స-2ఫేం! ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నోవాటెల్‌ పబ్‌లో ఈ ఘటన జరిగింది. బాధితురాలి వివరాల ప్రకారం.. ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి శనివారం రాత్రి పబ్‌కు వెళ్లింది. మ్యూజిక్‌ వింటూ సరదాగా నృత్యం చేస్తోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆశిష్‌ గౌడ్‌, అతడి స్నేహితులు అక్కడికొచ్చారు. అంద రూ మద్యం మత్తులో ఉన్నారు. తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో సినీనటిని ఆశి్‌షగౌడ్‌ తాకడంతో ఆమె చేతిలోని గ్లాస్‌ కిందపడింది. దీంతో ఆమెకు, ఆశి్‌షగౌడ్‌కు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసిం ది. తనను, తన స్నేహితులను ఆశి్‌షగౌడ్‌ అసభ్య పదజాలంతో దూషి స్తూ మానసికంగా వేధించాడని 100కు డయల్‌ చేసింది. మాదాపూర్‌ పోలీసులు వచ్చేలోపే ఆశి్‌షగౌడ్‌, అతడి స్నేహితులు అక్కడినుంచి పారిపోయారు. అనంతరం బాధితురాలు.. ఆశి్‌షగౌడ్‌పై మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై 354, 354ఏ, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై ఆశి్‌షగౌడ్‌ వివరణ ఇచ్చారు. తాను, తన స్నేహితులు ఎలాంటి తప్పూ చేయలేదని.. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొందరు కుమ్మకై దుష్పప్రచారం చేస్తున్నార ని ఆరోపించారు. ఏదైనా ఉంటే సాక్ష్యాధారాలతో నిరూపించాలన్నారు. కాగా వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరనిస్తూ పటాన్‌చెరులోని ఓ స్కూల్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో పిల్లలతో కలిసి పాల్గొన్న మరుసటి రోజే ఆశిష్‌ ఇలా వివాదంలో చిక్కుకోవడం చర్చనీ యాంశమైంది.
ఆధారాలతోనే ఫిర్యాదు
పబ్‌లో నా తప్పు ఏమిలేకుండానే నాతో, నా స్నేహితురాళ్లతో ఆశి్‌షగౌడ్‌ అసభ్యకరంగా ప్రవర్తించారు. నన్ను దూషించారు. సీసీ ఫుటేజీయే దీనికి ఆధారం. గొడవ జరిగే వరకు ఆశి ష్‌గౌడ్‌ అనే వ్యక్తి రాజకీయవర్గానికి చెందినవాడని నాకు తెలియదు. పబ్‌లో ఉన్న బౌన్సర్లు కూడా మాకు సహకరించకుండా వాళ్లకే అనుకూలంగా వ్యవహరించారు.

(Courtesy Andhrajyothi)

Leave a Reply