తెలంగాణ చేప పిల్లల టెండర్లు వాయిదా

0
323

– మత్స్యశాఖ అధికారుల నిర్ణయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్న 36 వేల చెరువులు, కుంటలు, 64 ప్రాజెక్టుల్లో 84 కోట్ల చేపపిల్లల ఉచిత పంపిణి టెండర్లను ప్రభుత్వం 10 రోజులు వాయిదా వేసింది. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. పంపిణిలో అవినీతి జరుగుతున్న నేపథ్యంలో వెంటనే టెండర్లను రద్దు చేయాలనీ, అందుకు సంబంధించిన నగదు మొత్తాన్ని సొసైటీ బ్యాంక్‌ ఖాతాలో జమ చేయాలని మత్స్యకార సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ మొదటి నుంచి డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీ

నికి తోడు ముదిరాజ్‌ సంఘం నాయకులు డి. రాజేంద్ర ప్రసాద్‌, నేషనల్‌ ఫిషరీస్‌ డైరెక్టర్‌ సీహెచ్‌. వెంకటేష్‌ కోర్టును ఆశ్రయించారు. కోర్టు వాయిదా ఈ వారంలో ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గడిచిన ఏడాది నిర్వహించిన టెండర్లలో సైతం అనేక అక్రమాలు జరిగినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సారీ కూడా ఆవే పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది.

వాయిదా కాదు రద్దు చేయాలి
లెల్లెల బాలకృష్ణ మత్స్యకార సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ, కన్వీనర్‌ ఉచిత చేపపిల్లల పంపిణిని వాయిదా కాకుండా వెంటనే రద్దు చేయాలి. మంత్రులు, అధికారులు తమ వాళ్లకు అనుకూలంగా నిబంధనలు సడలించి ఇష్టా రాజ్యంగా వ్యవహరించారు. గతంలో సైతం పంపిణిలో అక్రమాలు జరిగాయి. కేవలం కాంట్రాక్టర్లకు లాభం చేసేందుకు ప్రభుత్వంలోని పెద్దలు వ్యవహరిస్తున్నారు. వెంటనే టెండర్లను రద్దు చేసి, అందుకు సంబంధించిన నగదు మొత్తాన్ని సొసైటీ బ్యాంక్‌ ఖాతాలో జమ చేయాలి.

Courtesy Nava Telangana

Leave a Reply